Australia Vs Afghanistan: వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా టీమ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గాన్ మొదట బ్యాటింగ్ చేసింది. అందులో భాగంగానే అఫ్గాన్ టీమ్ దూకుడుగా ఆడుతూ నిర్ణీత 50 ఓవర్లకీ 5 వికెట్లు నష్టపోయి 291 పరుగులు చేసింది.ముఖ్యంగా అఫ్గాన్ ఓపెనర్ ప్లేయర్ అయిన ఇబ్రహీం జద్రాన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలి అంటే ఈ మ్యాచ్ లో పక్క గా గెలవాలి అని ఆఫ్గన్ టీమ్ బలంగా అనుకొని బరిలోకి దిగినట్టు గా ఉంది అందుకే వరుసగా వచ్చిన ప్లేయర్ వచ్చినట్టు చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. ముఖ్యంగా జద్రాన్ ఈ వరల్డ్ కప్ టోర్నీ లో తన మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు…
చివరి వరకు ఆడుతూ 129 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొదటి నుంచి చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమ్ కి ఒక అద్భుతమైన నాక్ ఆడాడు…ఇక ఈయనకి తోడు గా చివర్లో రషీద్ ఖాన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటం తో అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 291 భారీ స్కోరు చేయగలిగింది.
అయితే ఈ పసికూనల బలం రోజు రోజు కీ పెంచుకుంటూ పోతుంది. నిజానికి ఈ టీమ్ ఫ్యూచర్ లో ఒక గొప్ప టీమ్ గా అవతరిస్తుంది ఆనండం లో ఎలాంటి సందేహం లేదు.ఇక జద్రాన్ ఆడిన ఆట తీరు చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే.ఇక ఈ మ్యాచ్ లో గెలిచి తమ ఆధిపత్యాన్ని మరోసారి చూపించుకోవాలని అఫ్గాన్ టీమ్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
ఇక ఇలాంటి క్రమం లో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిస్తే అఫియల్ గా సెమీ ఫైనల్ కి వెళ్తుంది. ఇక ఆఫ్గనిస్తాన్ కనక ఈ మ్యాచ్ గెలిస్తే ఇక సెమీ ఫైనల్ కి ఒక అడుగు దూరంలో ఉంటుంది…ఇక ఇవాళ్టి మ్యాచ్ ఆస్ట్రేలియా వన్ సైడ్ చేస్తుంది అనుకున్నారు కానీ అఫ్గాన్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో చేసిందనే చెప్పాలి…
ఇక ఈ మ్యాచ్ లో అఫ్గాన్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు అనే దాని మీదనే ఆ టీమ్ విజయం అనేది ఆధారపడి ఉంటుంది.ఇక ముఖ్యంగా రషీద్ ఖాన్ బాల్ తో విజృంబిస్తే అఫ్గాన్ టీమ్ కి తిరుగు ఉండదు…ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ బౌలర్లలో హాజిల్ వుడ్ 2 వికెట్లు తీయగా, జంపా,మాక్స్ వెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు…ఈమ్యాచ్ కనక అఫ్గాన్ గెలిస్తే అద్బుతం జరిగినట్టే…