Australia T20 Series: ఆ ప్లేయర్ కి మళ్ళీ అన్యాయం చేసిన బిసిసిఐ…నెటిజన్ల ఫైర్…

ఇండియన్ టీమ్ చాలా సంవత్సరాల నుంచి వస్తూ పోతూ నిలకడ గా ఉండలేకపోతున్నారు బ్యాట్స్ మెన్స్ అండ్ వికెట్ కీపర్ అయినా సంజు శాంసన్ కి ఈ సీరీస్ లో కూడా అన్యాయం జరుగుతుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : November 21, 2023 11:25 am

Australia T20 Series:

Follow us on

Australia T20 Series: వరల్డ్ కప్ ముగిసిందో లేదో మళ్లీ ఆస్ట్రేలియా మీద t20 సిరీస్ కి ఇండియన్ టీం రెడీ అవుతుంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా తో ఆడే ఐదు మ్యాచ్ ల కోసం ఇండియన్ టీమ్ ప్లేయర్లను సెలెక్ట్ చేసింది. ఇక ఈనెల 23 వ తేదీ నుంచి డిసెంబర్ 3 వ తేదీ వరకు జరిగే ఐదు టి20 మ్యాచ్ లకు గాను టీమ్ కు సరికొత్త కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ని ఎంపిక చేశారు…

ఇక ఇండియన్ టీమ్ చాలా సంవత్సరాల నుంచి వస్తూ పోతూ నిలకడ గా ఉండలేకపోతున్నారు బ్యాట్స్ మెన్స్ అండ్ వికెట్ కీపర్ అయినా సంజు శాంసన్ కి ఈ సీరీస్ లో కూడా అన్యాయం జరుగుతుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి సంజు శాంసన్ అటు వన్డేలో కానీ,ఇటు తి 20 ల్లో కానీ చాలా మంచి స్కోర్ చేస్తూ మంచి రికార్డులు కూడా నెల కొల్పుతున్నాడు. కానీ కొంతమందిని పైకి లేపడానికి బిసిసిఐ ఇతన్ని పక్కన పెట్టాల్సి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బిసిసి కూడా ఈ వ్యవహారంలో అతనికి అన్యాయం చేస్తుందని పలువురు క్రికెట్ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

సంజు శాంసన్ టి20 ల్లో 21 ఇన్నింగ్స్ లలో 374 పరుగులు చేసి తనదైన మార్క్ చూపిస్తూ ప్రత్యేకమైన బ్యాటింగ్ స్టైల్ తో అందరిని ఆకట్టుకున్నాడు.అలాంటి ప్లేయర్ ని ఇప్పుడు పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐపీఎల్ లో మంచి ఫామ్ చూపించిన ప్రతి ఒక్కరిని ఈ సిరీస్ కోసం ఎంపిక చేయడం జరిగింది. మరి సంజు శాంసన్ కూడా ఐపిఎల్ లో చాలా బాగా ఆడారు. అలాగే ఆయన ఐపీఎల్ లో రాజస్థాన్ టీం కి కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయనను పక్కన పెట్టడం అనేది బిసిసిఐ చేస్తున్న కుట్రగా మరి కొంతమంది పరిగణిస్తున్నారు…

జూనియర్స్ అలాగే తన కంటే టాలెంట్ ఉన్న ప్లేయర్లను కూడా సెలెక్ట్ చేసి సంజు శాంసన్ కు మాత్రం బీసీసీఐ ఎప్పుడు అన్యాయం చేస్తూనే వస్తుంది. వన్డే వరల్డ్ కప్ కోసం కూడా అతన్ని సెలెక్ట్ చేయకపోవడం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి…ఇక ఇది ఇక ఉంటే ఈ టి 20 సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్ర తో పాటుగా గిల్ కి కూడా విశ్రాంతి ఇచ్చారు…

ఇక బిసిసిఐ ప్రకటించిన టీం స్క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం…
ఈ సీరీస్ కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా నియమించారు, ఇక రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్)గా వ్యవహరిస్తున్నారు, ఇషాన్ కిషన్,శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.

ఇక రీసెంట్ గా వన్డే వరల్డ్ కప్ అందుకున్న ఆస్ట్రేలియా టీమ్ మంచి జోష్ లో ఉంది.ఇక ఈ టీ20 సిరీస్‌లో భారత్‌తో తలపడే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే ప్రకటించింది. ఇందులో- మాథ్యూ వేడ్ (కెప్టెన్) జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాకు చోటు కల్పించింది…

ఇక ఈ సీరీస్ లో గెలిచి ఇండియన్ టీమ్ మొన్న వన్డే వరల్డ్ కప్ లో పోయిన పరువును తిరిగి దక్కించుకుంటారో లేదో చూడాలి…