https://oktelugu.com/

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. భారత్ లక్ష్యం 70.. ప్రస్తుతం 33/2

ఆస్ట్రేలియాతో రెండో బాక్సింగ్ టెస్టులో భారత్ గెలవాలంటే 70 పరుగులు చేయాలి. తొలి టెస్టులో 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన భారత్ పై ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు బలపడేలా తాజాగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ తడబడుతోంది. ప్రస్తుతం 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. Also Read: విరాట్ కోహ్లీ గొప్ప ఘనత.. దశాబ్ధపు మేటి క్రికెటర్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2020 / 08:48 AM IST
    Follow us on

    ఆస్ట్రేలియాతో రెండో బాక్సింగ్ టెస్టులో భారత్ గెలవాలంటే 70 పరుగులు చేయాలి. తొలి టెస్టులో 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన భారత్ పై ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు బలపడేలా తాజాగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ తడబడుతోంది. ప్రస్తుతం 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

    Also Read: విరాట్ కోహ్లీ గొప్ప ఘనత.. దశాబ్ధపు మేటి క్రికెటర్

    ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 133/6 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన అసీస్ మరో 67 పరుగులు సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. కామరూన్ గ్రీన్ 45 పరుగులతో టాప్ లో నిలిచాడు.టెయింలెండర్ల పోరాటంతో ఆస్ట్రేలియా స్కోరు 200 దాటింది. చివరి నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా ఏకంగా 101 పరుగులు చేయడం విశేషం. కమిన్స్, గ్రీన్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని పరుగులు సాధించారు. చివర్లో హేజిల్ వుడ్ 10, స్టార్క్ 14 నిలబడి ఆస్ట్రేలియాకు పరుగులు చేశారు.

    ఇక రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మరోసారి పేలవ ఫామ్లో ఉన్న మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 15 బంతులు ఆడి 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పూజారా సైతం మరోసారి తడబడి 3 పరుగులకే ఔట్ అయ్యాడు.

    Also Read: పట్టుబిగిస్తున్న టీమిండియా.. విజయం ముంగిట భారత్‌

    అయితే కెప్టెన్ రహానే, ఓపెనర్ శుభ్ మన్ గిల్ లు ధాటిగా ఆడుతూ ఫోర్లు కొడుతూ టీమిండియాను విజయం దిశగా నడిపిస్తున్నారు. అయితే పకడ్బందీ ఆస్ట్రేలియా బౌలింగ్ ను వీరు ఎలా కాచుకుంటారనేది వేచిచూడాలి.