Australia Vs india 1st Odi: టీమిండియా ఇటీవల కాలంలో ఒక్క వన్డే కూడా ఓడిపోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రారంభం నుంచి చివరి వరకు దూకుడుగా ఆడింది. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టును ఓడించి ట్రోఫీ అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో బలమైన ఆస్ట్రేలియా జట్టును కూడా భారత్ ఓడించింది. తద్వారా సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. అటువంటి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తడబాటుకు గురైంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ముందంజ వేసింది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా టీమ్ ఇండియాకు సారధిగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు గిల్. పాతిక సంవత్సరాల వయసులో ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. సారధిగా ఎంపికైనప్పటికీ గిల్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని చెత్తబుట్టు పాలు చేశాడు. ఎందుకంటే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచ్లో ఓటమిని చవిచూసిన సారధిగా గిల్ చెత్త రికార్డు నమోదు చేశాడు. గిల్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. గత ఏడాది గిల్ టి20 జట్టుకు సారథిగా వ్యవహరించాడు తొలి టి20 మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇక ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాదిలో వన్డేలలో టీమిండియా కు ఇది తొలి ఓటమి. వరుసగా 8 వన్డే మ్యాచ్లలో విజయాలు సాధించిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది..
పెర్త్ మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా తీవ్రంగా ఇబ్బంది పడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్ ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోలేక అవస్థలు పడ్డారు. బౌన్సీ పిచ్ కావడంతో బంతులు మీదికి దూసుకొచ్చాయి. దీంతో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మాత్రమే కాస్త సౌకర్యవంతంగా ఆడారు. వారిద్దరు కూడా భారీగా పరుగులు చేయడంలో విజయవంతం కాలేకపోయారు. పలుమార్లు వర్షం కురవడం కూడా ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసింది. ఒకవేళ వర్షం కురవకుండ ఉండి ఉంటే భారత ఆటగాళ్ల ఆట తీరు మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆరంభ మ్యాచ్లో ఓడిపోయి టీమిండియా సారధి గిల్ చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు.