https://oktelugu.com/

AUS VS SCT : టి20 లలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. స్కాట్లాండ్ పై ఆల్ టైం రికార్డ్..

టి20లలో అత్యధికంగా పవర్ ప్లే పరుగులు చేసిన రెండవ జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలో.. మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 5, 2024 / 01:38 PM IST

    AUS VS SCT T20 Match

    Follow us on

    AUS VS SCT  : ఆస్ట్రేలియా జట్టు స్కాట్లాండ్ తో జరిగిన తొలి t20లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో సరికొత్త ఘనతను సృష్టించింది. టి20 లలో పవర్ ప్లేలలో అత్యధిక స్కోర్ చేసిన టీం గా ఆవిర్భవించింది. ఫ్రాంచైజీ లీక్ లతో కలిపితే టి20లలో అత్యధికంగా పవర్ ప్లే పరుగులు చేసిన రెండవ జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలో.. మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.

    ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ (80 పరుగులు 25 బంతుల్లో చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి). మిచెల్ మార్ష్ (39 పరుగులను 12 బంతుల్లో చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి) విధ్వంసం సృష్టించారు. ఫలితంగా ఆస్ట్రేలియా పవర్ ప్లే లో ఏకంగా 113 రన్స్ చేసింది. ఇదే సమయంలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టి20 లలో పవర్ ప్లే లో హైయెస్ట్ స్కోర్ చేసిన జాబితాలో ఆస్ట్రేలియా తొలి స్థానాన్ని ఆక్రమించింది. స్కాట్లాండ్ పై 113/1 చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా కొనసాగుతోంది. వెస్టిండీస్ పై ఆ జట్టు 102/0 పరుగులు చేసింది. శ్రీలంకపై వెస్టిండీస్ 98/4 పరుగులు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ఫ్రాంచైజీ లీగ్ లను కలుపుకుంటే ఈ జాబితాలో హైదరాబాద్ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ లో ఢిల్లీ హైదరాబాద్ పవర్ ప్లే లో ఏకంగా 125 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లోనూ హెడ్ విధ్వంసాన్ని సృష్టించాడు. 32 బాల్స్ ఎదుర్కొని 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. 89 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు.

    హెడ్, మార్ష్ వీర విహారం

    స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 154 రన్స్ చేసింది. ఓపెనర్ మున్సే 16 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 28 పరుగులు చేశాడు. ఇతడు ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో అబాట్ మూడు వికెట్లు పడగొట్టాడు. జంపా, జేవియర్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్కాట్లాండ్ విధించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 9.3 ఓవర్లలోనే చేదించింది. హెడ్, మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరే గారు. వీరిద్దరూ ఏకంగా 14 బౌండరీలు కొట్టారు. జోష్ ఇంగ్లీష్ 13 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 27 రన్స్ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున జేక్ ప్రెజర్ t20 లలో ఎంట్రీ ఇచ్చాడు. అతడు మూడు బంతులు ఎదుర్కొని 0 పరుగులు మాత్రమే చేసి డక్ అవుట్ అయ్యాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.