అసీస్ దెబ్బ: కుప్పకూలిన టీమిండియా.. ఓటమి ముంగిట..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో టీమిండియా అసీస్ పేసర్ల ధాటికి కుప్పకూలింది. అసీస్ పేసర్లు హాజిల్ వుడ్, కమిన్స్ నిప్పులు చెరగడంతో టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు 36/9 పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా ముందు 90 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. Also Read: ‘కంగారు’ పెట్టించారు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులతో క్రీజులో ఉంది. ఈ టెస్టులో కేవలం 90 పరుగులే టార్గెట్ కావడంతో […]

Written By: NARESH, Updated On : December 19, 2020 7:29 pm
Follow us on

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో టీమిండియా అసీస్ పేసర్ల ధాటికి కుప్పకూలింది. అసీస్ పేసర్లు హాజిల్ వుడ్, కమిన్స్ నిప్పులు చెరగడంతో టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు 36/9 పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా ముందు 90 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.

Also Read: ‘కంగారు’ పెట్టించారు..

ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులతో క్రీజులో ఉంది. ఈ టెస్టులో కేవలం 90 పరుగులే టార్గెట్ కావడంతో ఆసీస్ గెలుపు బాటలో ఉంది.

టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరు 36 పరుగులకు టీమిండియా చేతులెత్తేసింది. శనివారం మూడోరోజు రెండో ఓవర్ నుంచే ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. హాజిల్ వుడ్ 5 వికెట్లు, కమిన్స్ 4 వికెట్లు తీసి భారట్ బ్యాటింగ్ ను నేలకూల్చారు. ఒక్కరు కూడా 10 పరుగులు దాటలేదంటే భారత్ బ్యాటింగ్ ఎంద దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: భారత్‌ జట్టులో మంచి ఆటగాళ్లే లేరా..!

చివరి వికెట్ లో మహ్మద్ షమీ(1) చేతికి బాల్ బలంగా తగలడంతో రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 21.2 ఓవర్లలో 36/9 పరుగులకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగులు కలుపుకొని ఆస్ట్రేలియా ముందు 90 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. విజయానికి చేరువలో అసీస్ ఉంది.