T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో.. ఆస్ట్రేలియా ముందడుగు.. 120 రన్స్ టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసింది

వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ వార్మప్ మ్యాచ్ లో ముందుగా నమిబియా బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా కీలక క్రీడాకారులతో బరిలోకి దిగింది.. నమిబియా జట్టు 0 పరుగులకే మైకేల్ వాన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 29, 2024 3:23 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు తొలి అడుగు బలంగా వేసింది. బుధవారం వెస్టిండీస్ వేదికగా నమీబియా జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.. నమిబియా విధించిన 120 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే చేదించడం విశేషం.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 54, టిమ్ డేవిడ్ 16 బంతుల్లో 23 పరుగులు సాధించారు. నమీబియా పై సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించారు.. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్ స్కోల్ట్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు..

వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ వార్మప్ మ్యాచ్ లో ముందుగా నమిబియా బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా కీలక క్రీడాకారులతో బరిలోకి దిగింది.. నమిబియా జట్టు 0 పరుగులకే మైకేల్ వాన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఇలా కీలక వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది.. జెన్ గ్రీన్ మినహా మిగతా వారెవరూ రాణించలేకపోయారు. అతడు మాత్రమే ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నాడు. 30 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 38 పరుగులు చేశాడు. నికోలాస్ డేవిడ్ 14, జెపి కొట్టే 13, గెర్ హార్డ్న్ 15, మలన్ కృగర్ 18, డేవిడ్ వైస్ 12 పరుగులు చేశారు.. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీశాడు. జోస్ హాజిల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. డేవిడ్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఫలితంగా నమిబియా 20 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 120 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. కేవలం 10 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 18 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు.. జోష్ ఇంగ్లీస్ ఐదు పరుగులకు స్కోల్ట్జ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టిమ్ డేవిడ్ కూడా స్కోల్ట్జ్ బౌలింగ్ లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. అయితే డేవిడ్ వార్నర్ మాత్రం నమీబియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. 21 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్ ల సహాయంతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. టిమ్ డేవిడ్ 16 బంతుల్లో 23 పరుగులు చేసే ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయం అనంతరం ఆస్ట్రేలియా తన తదుపరి వార్మప్ మ్యాచ్ ను వెస్టిండీస్ తో ఆడుతుంది.