Homeఎంటర్టైన్మెంట్Mokshagna's entry: మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య కీలక వ్యాఖ్యలు... ఆ ముగ్గురు హీరోలని చూసి...

Mokshagna’s entry: మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య కీలక వ్యాఖ్యలు… ఆ ముగ్గురు హీరోలని చూసి నేర్చుకోవాలట!

Mokshagna’s entry: నందమూరి అభిమానులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న క్షణం మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. బాలకృష్ణ(Balakrishna) నట వారసుడిగా మోక్షజ్ఞ హీరో కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాల్సింది. బాలకృష్ణ బాల నటుడిగా నట ప్రస్థానం మొదలు పెట్టాడు . ఇక మోక్షజ్ఞ అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) సైతం బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. బాల రామాయణం మూవీలో రామునిగా నటించి మెప్పించాడు. నూనూగు మీసాల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు.

మోక్షజ్ఞ ప్రస్తుత వయసు మూడు పదులకు చేరుకుంటుంది. అయినా ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రతి ఏడాది బాలకృష్ణ మోక్షజ్ఞ నట ప్రవేశం పై వాగ్దానం చేస్తున్నారు . అవన్నీ ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి. తాజాగా మరోసారి బాలయ్య మోక్షజ్ఞ త్వరలో హీరో అవుతున్నాడని ఫ్యాన్స్ లో ఆశలు రేపాడు. గత రాత్రి విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన గ్యాంగ్స్ గోదావరి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యాడు.

Also Read: Balakrishna: కవల పిల్లలం.. హీరో విశ్వక్ సేన్ కు అందరి ముందే షాక్ ఇచ్చిన బాలయ్య…

వేదికపై మాట్లాడుతూ విశ్వక్ సేన్ ని బాలకృష్ణ ప్రశంసించాడు. మేము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములమని బాలయ్య అన్నారు. విశ్వక్ సేన్ సినీ జర్నీని నేను పరిశీలిస్తున్నాను. ప్రతి సినిమాకు కొత్తదనం కోరుకుంటున్నాడు. నాన్న ఎన్టీఆర్ నుండి నేను నేర్చుకుంది అదే. మనం సరికొత్తగా ప్రయత్నం చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని నాన్న ఎన్టీఆర్ చెప్పేవారు.

Also Read: Pushpa 2 Movie Sooseki Song: పుష్ప 2 లోని ‘సుసేకే నా సామి’ సాంగ్ ను దేవి ఆ సాంగ్ నుంచి కాపీ చేశాడా..?

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మోక్షజ్ఞ నన్ను కాదు… అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను ఆదర్శంగా తీసుకోవాలి. మోక్షజ్ఞకు నేను సూచించేది ఇదే అన్నారు. కాబట్టి ఈ ఏడాది మోక్షజ్ఞ హీరో కావడం ఖాయమని నందమూరి అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరి దర్శకుడు ఎవరు? జోనర్ ఏమిటో? తెలియాల్సి ఉంది. మరోవైపు బాలయ్య తన 109వ చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంది.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version