Sania Mirza Retirement: టెన్నిస్ కు మనదేశంలో ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని దశాబ్దాల క్రితం అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు..దీంతో క్రీడాకారుల్లో భవిష్యత్తుపై భరోసా ఉంటుందని ఆశలు ఉండేవి కావు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె టెన్నిస్ ను కెరియర్‌గా ఎంచుకుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించింది. అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. తాను ఎరిగింది. ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. తన అకాడమీ భవిష్యత్తు తారలకు శిక్షణ ఇస్తోంది. సానియా మీర్జా. తన కెరియర్ లో చివరి అంకాన్ని ముగించింది. 36 సంవత్సరాల సానియా ఆఖరి ఆట ఆడేసింది. మంగళవారం సాయంత్రం అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ తో కలిసి డబుల్స్ మ్యాచ్ లో పాల్గొన్న సానియా ఆరంభ రౌండ్ లోనే ఓటమిపాలై అంతర్జాతీయ టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది.
మొదట సింగిల్స్ లో…
సానియా మీర్జా మొదట సింగిల్స్ లో అడుగు పెట్టింది. తర్వాత డబుల్స్ లోకి మారింది. డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్, మూడు డబుల్స్, మూడు మిక్స్డ్ గ్రాండ్ స్లామ్స్ తో పాటు ఆసియా క్రీడల్లో 8, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు సాధించింది. ఇలా ఆమె సుదీర్ఘ కెరియర్లో ఎన్నో మహిళలు సాధించింది. సనాతన కట్టుబాట్లను అధిగమించి, కలలుగన్న జీవితం కోసం పోరాడి గెలిచింది. సానియా మీర్జా పుట్టింది ముంబైలో.. పెరిగింది మాత్రం హైదరాబాదులోనే. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పోర్ట్స్ జర్నలిస్ట్. తల్లి నసీమా వ్యాపారం చేసేది. చిన్నప్పుడే సానియాకు టెన్నిస్ అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో ఆమె తండ్రి కొంతకాలం శిక్షకుడిగా వ్యవహరించాడు.
జూనియర్ సర్క్యూట్లో..
2001 నుంచి 2003 వరకు జూనియర్ సర్క్యూట్లో సానియా రాణించింది. 2003లో ప్రొఫెషనల్ గా మారింది. జూనియర్ స్థాయిలో 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్ లు కొల్లగొట్టింది. వైల్డ్ కార్డు ఎంట్రీ తో తొలిసారి డబ్బు టి ఏ టోర్నీ హైదరాబాద్ ఓపెన్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకుంది. 2002 ఆసియా క్రీడల్లో లియాండర్ పేస్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది. ఇక సానియా పొట్టి బట్టలు వేసుకొని టెన్నిస్ ఆడటం తమ మతానికి వ్యతిరేకమని కొందరు మత పెద్దలు ఆమెపై ఫత్వా జారీ చేశారు. ఆమె పాకిస్తాన్ దేశీయుడు షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకోవడంతో సానియా పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను ప్రభుత్వం ఎంపిక చేస్తే.. పాక్ కోడలని ఆ కుర్చీలో కూర్చోబెడతారా అంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.. 2008 పెర్త్ లో ఓ టోర్నీ సందర్భంగా భారతీయ జెండా ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుని మ్యాచ్ తిలకిస్తూ ఉంటే త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచిందంటూ అప్పట్లో కొందరు కోర్టుకు కూడా వెళ్లారు.
మత పెద్దల ఆగ్రహం
మక్కా మసీదులో వాణిజ్యపరమైన షూటింగ్ నిర్వహించి మత పెద్దల ఆగ్రహానికి గురైంది సానియా. తన భద్రత కోసం నియమించుకున్న సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేదన్న ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీస్ యంత్రాంగానికి సానియా క్షమాపణలు చెప్పింది. ఇక అంతర్జాతీయ ఈవెంట్లలో సానియా మీర్జా మెరిసింది తక్కువే. 2005 ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ లో మూడో రౌండ్ కు చేరుకుంది. కానీ సెరేనా విలియమ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఓపెన్ విజేతగా నిలవడం ద్వారా డబ్ల్యూటిఎ టైటిల్ నెగ్గిన తొలి భారత మహిళా రికార్డు నెలకొల్పింది. 2005లో యుఎస్ ఓపెన్ నాలుగో రౌండ్ కు చేరి సంచలనం సృష్టించిన సానియా.. 2006 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సీడింగ్ దక్కించుకోవడం విశేషం.
27వ ర్యాంకుకు ఎగబాకింది
తర్వాత నిలకడైన ప్రదర్శన చేయడంతో సింగిల్స్ లో 27వ ర్యాంకు ఎగబాకింది. ఇలా 2010 వరకు సింగిల్స్, డబుల్స్ లో రాణించిన మీర్జా… మణికట్టు గాయంతో కాలం బ్రేక్ తీసుకుంది. 2010లో ఆసియా క్రీడల సింగిల్స్ లో కాంస్యం, మిక్స్ డ్ లో రజతం సొంతం చేసుకుంది. 2013_15 లో సానియా కెరియర్ ఉచ్చదశలో సాగింది. 2011లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లో ఫైనల్ చేరిన సానియా… వరుసగా మూడు గ్రాండ్ స్లామ్ లు నెగ్గింది. మార్టినా హింగిస్ తో జతకట్టి కెరియర్ టాప్ గేర్ లోకి తీసుకెళ్లింది. డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది. 2015 లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ విజేతలుగా సానియా హింగీస్ జంట నిలిచింది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది. తరచూ గాయాల బారిన పడుతున్నడంతో 2023లో కెరియర్ ముగిస్తానని ప్రకటించి… ఆ నిర్ణయం తీసుకుంది.. దుబాయ్ లో జరిగిన ఓపెన్ లో టెన్నిస్ కు వీడ్కోలు పలికింది. ప్రస్తుతం ఆమె మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు మెంటర్ గా వ్యవహరించనుంది. హైదరాబాద్ శివారులో టెన్నిస్ అకాడమీ కూడా నిర్వహిస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: At the time of retirement sania mirza gave a twist at the end
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com