Asia Cup 2025 India Vs Pakistan: క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్లు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు క్రికెట్ ఆడుతుంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ప్రతి ఫార్మాట్ లోను ఇదే ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది. పహల్గామ్ దాడి తర్వాత ఈ రెండు జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి.. ఆసియా కప్ లో భాగంగా ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు దే పై చేయి. పైగా ఇటీవల కాలంలో జరిగిన టోర్నీలలో భారత్ స్పష్టమైన పై చేయి ని ప్రదర్శించింది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్లో కూడా భారత గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. క్రీడా విశ్లేషకుల నుంచి అవే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారత జట్టు టి20 ఫార్మాట్ లో ఎదురనేది లేకుండా దూసుకుపోతోంది. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే దక్షిణాఫ్రికా వరకు ఇలా ప్రతి జట్టును ఓడించి టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. పైగా టీమిండియాలో అందరూ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. తొలి మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును కేవలం 60 పరుగుల లోపే ఆల్ అవుట్ చేసిందంటే భారత జట్టు సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్లో కూడా ఆటగాళ్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నారు. అందువల్లే టీమిండియా ఆసియా కప్ ఫేవరెట్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. సూర్యకుమార్ ఆధ్వర్యంలో టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. టి20 వరల్డ్ కప్ నుంచి మొదలుపెడితే ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ వరకు టీమిండియా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. విదేశీ, స్వదేశీ అని తేడా లేకుండా సిరీస్ ల మీద సిరీస్ లు అర్థం చేసుకుంది టీం ఇండియా.
ప్రస్తుత జట్టు ప్రకారం చూసుకుంటే ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఎలాంటి మైదానం పైన అయినా అదరగొట్టే సత్తాను కలిగి ఉన్నారు. యూఏఈ వేదికగా జరిగిన సిరీస్ లలో భారత్ జట్టుకు తిరుగులేదు. పైగా ఈ మైదానంపై ఇటీవల ఛాంపియన్ ట్రోఫీని టీమిండియా దక్కించుకుంది. ఈ వేదికపై రకరకాల పిచ్ లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ విషయంలో కూడా అదే వైవిధ్యాన్ని ప్రదర్శించింది. అందువల్లే టీమిండియా ఆదివారం నాటి పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఫేవరెట్ లాగా కనిపిస్తోంది. అద్భుతం జరిగితే తప్ప టీమిండియా ఈ మ్యాచ్లో ఓడిపోవడం కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఓమన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడింది. భారీగా పరుగులు చేయాల్సిన చోట చేతులెత్తేసింది. ఒకవేళ ఓమన్ జట్టు కనుక బలంగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ జట్టు భారత్ తో తలపడే మ్యాచ్ లో సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇటీవల ఫలితాలే ఆ జట్టుకు పునరావృతమవుతాయి.