Crisis in Pakistan : భారత్ ఉపఖండంలో అత్యంత దయనీయ, దుర్భల పరిస్థితుల్లో ఉన్న ప్రజానీకం పాకిస్తాన్ లో ఉంది. గుప్పటి గోధుమల కోసం ఎగబడిన పాకిస్తాన్ ప్రజలు.. ద్రవ్యోల్బణం అన్ని దేశాల కంటే అత్యధికంగా ఉండి ప్రజలు తంటాలు పడుతున్నారు. బిచ్చగాళ్లు సౌదీలో ఎక్కువ ఉన్నారని సర్వేచేస్తే అందరూ పాకిస్తాన్ వారే. చేసిన అప్పులు తీర్చలేని ప్రభుత్వం. చేసిన అప్పులను తీర్చడానికి అన్ని దేశాలను అడుక్కుంటున్న దేశం. ఎన్నికలు నిజంగా జరిగి గెలిచిన ప్రజాప్రతినిధి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నిజమైన ప్రతినిధి ఆయనే అవుతాడు. ఉన్న ప్రభుత్వం ఆర్మీ చెరలో బందీ..
పాకిస్తాన్ లో బెలూచీలు, ఫంక్తూన్లు పంజాబీలకు వ్యతిరేకంగా పోరాటం.. సింధీలు నీటి కోసం పోరుడుతూ అతలాకుతలం.. గిల్గిట్ బాలిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోనూ అవే నిరసనలు.. ఎక్కడైనా పాకిస్తాన్ లో కంఫర్ట్ గా.. ప్రశాంతంగా ఉన్నారా? అని చూస్తే..
10 శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు. కులీన పంజాబీ కుటుంబం నుంచి వచ్చినవారు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు ప్రశాంతంగా ఉన్నారు. వీరికి పాకిస్తాన్ లో లండన్ లో.. విదేశాల్లో ఇల్లు ఉంటాయి.
నేపాల్ లో ప్రజలు ఏదైతే ప్రజలు ఫీలయ్యారో అంతకంటే తక్కువ పాకిస్తాన్ లో లేదు. తీవ్ర పేదరికం.. బడా సంపన్నుల పాలన మధ్య పాకిస్తాన్ ప్రజల్లో తిరుగుబాటు రాలేదు..
దుర్భల స్థితిలో పాక్ ప్రజలు మరి తిరుగుబాటు తప్పదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
