
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ ఘన విజయం సాధించడానికి ఆ టీం కెప్టెన్ టిమ్ పైన్ కూడా ఒక కారణమని సీనియర్ బౌలర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిడ్నీ టెస్టులో అశ్విన్ పై అసీస్ కెప్టెన్ టిమ్ పైన్ నోరు పారేసుకున్నారు. ‘గబ్బాకు రా చూసుకుందాం’ అంటూ సెటైర్లు వేశాడు. దీనికి అశ్విన్ కూడా గట్టిగానే సమాధాన మిచ్చాడు. ‘నువ్వు ఇండియాకు వస్తే అదే నీ ఆఖరి సిరీస్’ అని అశ్విన్ సైతం సవాల్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
Also Read: కరోనా తరువాత.. భారత గడ్డపై సమరానికి రెడీ..
ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ తర్వాత బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పినా అశ్విన్ మాత్రం దీన్ని వదలడం లేదు. తాజాగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తో ముచ్చటించారు. తన యూట్యూబ్ చానెల్ లో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా మరోసారి టిమ్ పైన్ పైన అశ్విన్ సెటైర్లు వేశాడు.
గబ్బా టెస్టులో టిమ్ పైన్ చేసిన తప్పిదమే ఆస్ట్రేలియా ఓటమికి దారితీసిందని అశ్విన్ తెలిపారు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను గెలిపించిన పంత్ ను స్టంపింగ్ చేయకుండా వదిలేశాడని.. అదే పంత్ భారత్ ను గెలిపించి సిరీస్ విజయాన్ని అందించాడని గుర్తు చేశారు. టిమ్ పైన్ వల్లే భారత్ సిరీస్ గెలిచిందని అశ్విన్ ఎద్దేవా చేశారు.
Also Read: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జరిగిన సంఘటనపై రవిశాస్త్రీ..
సిడ్నీ టెస్టులో అశ్విన్ , హనుమ విహారితో కలిసి రోజంతా బ్యాటింగ్ చేసి భారత్ ఓడిపోకుండా కాపుకాశాడు. అశ్విన్ బ్యాటింగ్ చేస్తుండగా తట్టుకోలేని పైన్ ఈ వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టాడు.
https://www.youtube.com/watch?v=Zhk9ePIYBEQ