Good Bad Ugly : సౌత్ ఇండియాలో అభిమానులు దేవుడితో సమానంగా కొలిచేంత అభిమానం ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది సూపర్ స్టార్స్ లో ఒకరు అజిత్ కుమార్(Thala Ajith Kumar). తమిళనాడు లో హిట్/ఫ్లాప్ లతో సంబంధం లేకుండా, రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టగలిగే సత్తా ఉన్న ఏకైక హీరో ఆయన మాత్రమే. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘విడాముయార్చి'(Vidamuyaarchi Movie) కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు తమిళనాడు లో అజిత్ కి కాకుండా, విజయ్(Thalapathy Vijay) కి మాత్రమే వస్తాయి. రజినీకాంత్(Superstar Rajinikanth) కూడా ఈమధ్య బాగా తగ్గిపోయాడు. అయితే ఎంత కాలం ఇలా చెత్త సినిమాలను భరిస్తూ రావాలి?, అభిమానులకు గర్వంగా చెప్పుకొనే ఒక్క సినిమా అయినా విడుదల చేయొచ్చు కదా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.
Also Read : అజిత్ ‘గుడ్..బ్యాడ్..అగ్లీ’ టీజర్ వచ్చేసింది..ఈసారి టార్గెట్ మిస్ అయ్యేలా లేదు..ఫ్యాన్స్ కి పండగే!
అలా అభిమానుల కోసమే తీసిన చిత్రం ‘గుడ్..బ్యాడ్..అగ్లీ'(Good Bad Ugly Movie). మన టాలీవుడ్ లో లీడింగ్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం ద్వారానే తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతుంది. ఈ నెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు, ఫిలిం నగర్ లో ఎలాంటి టాక్ ఉంది?, అజిత్ ఈసారైనా భారీ కం బ్యాక్ ఇస్తాడా?, అభిమానులను అలరిస్తాడా లేదా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే రీసెంట్ గానే మొదటి కాపీ సిద్ధమైంది. నిర్మాతలు టాలీవుడ్ లో కొంతమంది ముఖ్యమైన మీడియా ప్రతినిధులకు, అదే విధంగా కొన్ని ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కి ఈ సినిమాని వేసి చూపించారు. వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
అజిత్ చిత్రాల్లో మనకి బాగా ఇష్టమైన సినిమా ‘గ్యాంబ్లర్’. ఇందులో అజిత్ ఊర మాస్ యాటిట్యూడ్ కి తెలుగు ఆడియన్స్ కూడా మెంటలెక్కిపోయారు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వింటేజ్ అజిత్ ని వెండితెర పై చూసి అభిమానులు చాలా కాలమే అయ్యింది. అలాంటి వింటేజ్ అజిత్ ని ఈ సినిమాలో మరోసారి చూపించారట డైరెక్టర్ అద్విక్ రవి చంద్రన్. ఒక గ్యాంగ్ స్టర్ తన గతాన్ని మొత్తం మర్చిపోయి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ గతం ఆయన్ని వెంటాడుతూనే ఉంటుంది, గతం తాలూకూ మనుషుల వల్ల ఆయన ఎన్నో సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది, ఇంతకు గతం లో అజిత్ ఏమి చేసాడు?, ఎంత పెద్ద గ్యాంగ్ స్టర్ అనేది స్టోరీ అట. స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంది కానీ, సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా, ఆద్యంతం గూస్ బంప్స్ రప్పించే సన్నివేశాలతో నింపేసాడట డైరెక్టర్, కచ్చితంగా ఈ చిత్రం ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరిస్తుందనే టాక్ బలంగా వినిపిస్తుంది.
Also Read : అజిత్ ‘గుడ్..బ్యాడ్..అగ్లీ’ లో నందమూరి బాలకృష్ణ..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్!