Ashutosh Sharma: శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్ ధాటికి మెక్ గూర్క్(1), అభిషేక్ పోరెల్(0), సమీర్ రిజ్వి (4) అవుట్ అయ్యారు. అప్పటికి ఢిల్లీ జట్టు(LSG vs DC)స్కోరు 7 పరుగులు మాత్రమే.. లక్నో జట్టును ఓడించాలంటే ఇంకా 203 పరుగులు చేయాలి. అక్షర్ పటేల్(Akshar Patel), స్టబ్స్(Stubbs), డూ ప్లెసిస్ మీద మాత్రమే ఆశలు ఉన్నాయి. అయితే వీరు జట్టుకు అవసరమైన సందర్భంలో మెరుగైన పరుగులు చేసినప్పటికీ.. కీలక దశలో అవుట్ అయ్యారు. దీంతో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మరోవైపు లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh pant) బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నాడు. ఈ దశలో వచ్చిన అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగం(vipraj Nigam) మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. శర్మ 66, నిగం 39 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. కీలక దశలో నిగం అవుట్ అయినప్పటికీ.. శర్మ చివరి వరకు ఉన్నాడు. ఏమాత్రం అధైర్య పడకుండా.. ఒత్తిడికి గురికాకుండా విజయాన్ని సంపూర్ణం చేశాడు. వాస్తవానికి గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడుతున్నప్పుడు.. శర్మ గట్టిగా నిలబడ్డాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే ఢిల్లీ జట్టు విజయం సాధించి ఉండేది కాదు. నిగం అవుట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్ళు కూడా చేతులెత్తేసినప్పటికీ శర్మ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. పైగా లక్నో బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పరుగులు ధారాళంగా తీసి ఢిల్లీ జట్టును గెలిపించాడు.
Also Read: ఏడు రన్స్ కే మూడు వికెట్లు.. పడి లేచిన కెరటంలా ఢిల్లీ గెలిచింది
ఇదీ నేపథ్యం
2023లో అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో అశుతోష్ శర్మ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం ప్రాంతంలో అశుతోష్ శర్మ జన్మించాడు.. 2018లో టి20లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన క్రికెట్ కెరియర్ ను మధ్యప్రదేశ్ రాష్ట్ర జట్టు(Madhya Pradesh State cricket team)తో ప్రారంభించాడు.. 2018లో టి20లోకి ఎంట్రీ ఇచ్చిన శర్మ.. అదే ఏడాది లిస్ట్ – ఏ లో ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు మారిపోయాడు. 2024 ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అయితే గత ఏడాది పంజాబ్ జట్టు(kings XI Punjab) అతడిని 20 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ జట్టు తరఫున అశుతోష్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిది మ్యాచ్ లు ఆడి 189 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్
167.25. తాజాగా సోమవారం విశాఖపట్నం లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 66 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ ఢిల్లీ జట్టు(Delhi capitals) విజయానికి ఉపకరించింది. ఇక గత ఏడాది జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అశు తోష్ శర్మను 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గత ఏడాది ఐపీఎల్(Indian premier league) లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మాదిరిగానే.. సోమవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో అశుతోష్ శర్మ ఆడాడు. 31 బంతులు ఎదుర్కొన్న శర్మ 5 ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా నిలవడం విశేషం. డూ ప్లెసిస్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అశుతోష్ శర్మ స్టబ్స్ తో ఆరో వికెట్ కు 48, విప్రజ్ నిగంతో ఏడో వికెట్ కు 55, కులదీప్ యాదవ్ తో తొమ్మిదో వికెట్ కు 21, మోహిత్ శర్మతో 19* పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
View this post on Instagram