https://oktelugu.com/

Arshad Nadeem : కల్లోల పాక్ లో ఒలింపిక్ ఆణిముత్యానివనుకుంటే.. నువ్వేంట్రా బాబూ ఉగ్రవాదితో కలిసి పోయావు..

పారిస్ ఒలిపిక్స్ లో స్వర్ణం గెలిచిన తర్వాత నదీమ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే అతడు నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ నాయకుడు హరీస్ ధార్ ను కలిశాడు.. నదీమ్ ఇంటికి హరీస్ వెళ్లాడు. అతడి భుజంపై చేయి వేసి మాట్లాడాడు. దీనిని కొంతమంది వీడియో తీసి.. సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశారు. అయితే ఈ వీడియో ఎప్పటిదనే దానిపై ఒక స్పష్టత లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 14, 2024 / 10:28 AM IST

    Arshad Nadeem

    Follow us on

    Arshad Nadeem: పారిస్ ఒలింపిక్స్ లో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పసిడి పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో విభాగంలో 92.7 మీటర్ల దూరం ఈట విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజతం గెలుచుకున్నాడు. టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం రజత పతకానికే పరిమితమైపోయాడు. గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో నదీమ్ ను తన పెద్ద కొడుకుని నీరజ్ చోప్రా తల్లి పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనంగా మారాయి. మరోవైపు నదీమ్ కూడా ఆమెను తన తల్లిగా పేర్కొన్నాడు. దీంతో రెండు దేశాల మధ్య ఒక్కసారిగా శాంతిపూర్వకమైన వాతావరణం ఏర్పడింది. ఊరు మొత్తం చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే.. వాటి ద్వారా శిక్షణ పొందిన నదీమ్.. పాకిస్తాన్ కు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అందించాడు. ఆ దేశ పరువును కాపాడాడు. ఈ క్రమంలో నదీమ్ పై ప్రశంసల జల్లు కురిసింది. గ్లోబల్ మీడియా కూడా అతడి విజయాన్ని గొప్పగా కీర్తించింది.

    గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో..

    గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో నదీమ్ కు సింధు ప్రావిన్స్ ఐదుకోట్ల నగదు బహుమతి ప్రకటించింది. నదీమ్ మామ అతడికి గేదెను బహూకరించాడు. ఇంకా ఆ దేశానికి చెందిన కొంత మంది వ్యక్తులు రకరకాల బహుమతులు అందించారు. గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో నదీమ్ పై పాకిస్తాన్ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ మౌర్యం నవాజ్ 10 మిలియన్ రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించారు. హోండా సిటీ కారు కూడా అందజేశారు. దానికి 92.97 నెంబర్ కేటాయించారు. ఇక పాకిస్తాన్ దేశానికి చెందిన పలువురు వ్యాపారులు కూడా నదీమ్ పై కనక వర్షం కురిపించారు.. ఇదే సమయంలో భారతీయులు కూడా నదీమ్ ను అభినందనలతో ముంచెత్తారు. అయితే అలాంటి ఈ స్టార్ అథ్లెట్ ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఫోటో అతడిని వివాదాల్లోకి నెట్టేసింది.

    స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత..

    పారిస్ ఒలిపిక్స్ లో స్వర్ణం గెలిచిన తర్వాత నదీమ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే అతడు నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ నాయకుడు హరీస్ ధార్ ను కలిశాడు.. నదీమ్ ఇంటికి హరీస్ వెళ్లాడు. అతడి భుజంపై చేయి వేసి మాట్లాడాడు. దీనిని కొంతమంది వీడియో తీసి.. సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశారు. అయితే ఈ వీడియో ఎప్పటిదనే దానిపై ఒక స్పష్టత లేదు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న నేపథ్య నెటిజన్లు స్పందిస్తున్నారు..”కల్లోలిత పాకిస్తాన్ లో ఒలింపిక్ ఆణిముత్యం నువ్వని అనుకున్నాం. పసిడి పతకం సాధించిన తర్వాత గొప్పోడివని భావించాం. కానీ నువ్వెంట్రా బాబూ ఉగ్రవాదుల్లో కలిసి పోయావని” వ్యాఖ్యానిస్తున్నారు.

    అండగా పాక్ నెటిజన్లు

    ఈ వీడియో పై నదీమ్ ఇంతవరకూ స్పందించలేదు. అతనికి పాకిస్తాన్ నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. ” అతడు పేద కుటుంబానికి చెందినవాడు. కష్టాలు పడి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇలాంటి సమయంలో అతనిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆ వీడియో ఎప్పటిదో తెలియదు. పైగా ఇప్పుడు సర్కులేట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక పేద అథ్లెట్ గోల్డ్ మెడల్ సాధిస్తే ఓర్చుకోలేకపోతున్నారని” పాక్ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.