Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ఆయనకు చాలా గొప్ప బిరుదులను తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా మెగాస్టార్ అనే ఒక నేమ్ తో ఆయన 40 సంవత్సరాల పాటు ఆ గుర్తింపును కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు పాన్ ఇండియా సినిమా గా ఆయన చేసిన ‘సైరా ‘ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు. అందువల్ల మరోసారి ఆయన పాన్ ఇండియా సినిమా చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమాతో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు…రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ‘జైలర్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాడు. ఇక మరో సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ కూడా ‘విక్రమ్ ‘ సినిమాతో 300 కోట్ల కు పైన కలెక్షన్లను రాబట్టాడు. ఇక సీనియర్ హీరోలు ఇద్దరు భారీ సక్సెస్ అందుకున్నారు. కాబట్టి చిరంజీవి కూడా వాళ్ల బాటలోనే పాన్ ఇండియా రేంజ్ లో ఒక అదిరిపోయే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు…
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ లో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాని ‘శంకర్ దాదా జిందాబాద్’ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాలో గాంధీగిరి ని అనుసరిస్తున్న ఒక పాత్రలో చిరంజీవి నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలందుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఈ సినిమా చివర్లో ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ నటించి మెప్పించాడు.
ఇక పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను మొదట బాలీవుడ్ బాద్షా అయిన షారుఖాన్ తో నటింపజేయాలని చిరంజీవి అనుకున్నాడు. కానీ ఆయన మాత్రం ఆ పాత్రను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అది క్లైమాక్స్ లో వచ్చే ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే కాబట్టి దాని ద్వారా షారుక్ ఖాన్ కి కూడా వచ్చేది ఏమీ లేదనే ఉద్దేశ్యంతో ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక దాంతో దర్శకుడు ప్రభుదేవా ఆ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ని తీసుకొని ప్రేక్షకులందరిలో మంచి జోష్ అయితే నింపాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయిన కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను స్క్రీన్ మీద చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…