Aryna Sabalenka: టెన్నిస్ ప్రపచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ. దీనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఈ ఆటకు మంచి క్రేజ్ ఉంది. భారతీయులు కూడా టెన్నిస్‌లో రాణిస్తున్నారు. ఇక టెన్నిస్‌ను గ్లామర్ గేమ్ అని కూడా అంటారు. టెన్నిస్ ఆడే మహిళా స్టార్స్ అంతా అందమైన అమ్మాయిలే. అందుకే ఈ ఆటకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. క్రీడాకారులకు కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అభిమానుల ప్రోత్సాహంతో టెన్నిస్ స్టార్ ఆటలో రాణిస్తున్నారు. తాజాగా బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా(Ariyana Sabalenka) ఆటతోనే కాదు.. డాన్స్‌తోనూ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుభారంభం చేసిన అనంతరం తనలోని మరో కోణాన్ని అభిమానుల ముంద ప్రదర్శించింది.
వరస్ట్ డాన్సర్ని అంటూనే
ఆస్ట్రేలియా ఓపెన్(Australia Open) మ్యాచ్ ముగిసిన తర్వాత యాంకర్ డాన్స్ చేయాలని కోరింది. అయితే సబలెంక తన డాన్స్ బాగుండదు.. నన్ను వరస్ట్ డాన్సర్ అని అందరూ గుర్తు పెట్టుకుంటారు అని పేర్కొంది. అనంతరం సబలెంకా క్యూట్ మూవ్‌తో స్టెప్పులేసింది. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ చప్పట్లతో ఎంకచేజ్ చేశారు. ఫిదా అయ్యారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘హ్యాట్రిక్’పై గురి..
ఇదిలా ఉంటే..సబలెంకా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ టోర్నీ బరిలో దిగింది. వరుసగా మూడోసారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్లుగానే తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–2తో 2017 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ స్లోన్ స్టీఫెన్స్‌ను ఓడించింది. ఇక సబలెంకా 2023, 2024లో చాంపియన్‌గా నిలిచింది. ఈసారి టైటిల్ సాధిస్తే మార్టినా హింగిస్ తర్వాత హ్యాట్రిక్ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు ఒందుతుంది.
Aryna Sabalenka dancing for Australian Open crowd after winning her 1st round against Sloane Stephens
“Now they have proof that I’m the worst dancer”
Give this woman a spotlight and she will shine
— The Tennis Letter (@TheTennisLetter) January 12, 2025