Sankranti 2025: ఇప్పటివరకు గోదావరి జిల్లాలకు ( Godavari district)వచ్చే అల్లుళ్లకు ఘన ఆతిథ్యం ఇస్తుంటారు. అత్తవారింటికి వస్తే వందలాది రకాలతో.. పసందైన వంటకాలతో అల్లుడికి మర్యాద చేస్తారు. గోదావరి మర్యాదలు చాటి చెబుతారు. అయితే తాజాగా ఆంధ్రా అల్లుడికి తెలంగాణలో 130 రకాల వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు. తెలంగాణ వంటకాలతో అబ్బురపరిచారు. సంక్రాంతి పండగకు ముందుగానే వెళ్లిన అల్లుడికి అత్తవారిచ్చిన ఆతిథ్యం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఒకటి కాదు రెండు కాదు వందలాది వంటకాలు కావడంతో.. రుచి చూసి మైమరిచిపోయాడు ఆ అల్లుడు. హైదరాబాదులోని సరూర్ నగర్ సమీపంలో.. శారదా నగర్ లో ఈ పసందైన ఆతిథ్యం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* మాంసాహారం, శాఖాహారం
శారదా నగర్ లో( Sarada Nagar ) నివాసం ఉంటున్న కాంతి, కల్పనా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయికి కాకినాడకు( Kakinada) చెందిన మల్లికార్జున్( Mallikarjun ) తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని భావించారు. 130 రకాల వంటకాలను వడ్డించారు. వాటిని చూసి ఆశ్చర్యపోయారు మల్లికార్జున్. పిండి వంటలతో పాటు మాంసాహారం, శాఖాహారం, పులిహోర, బగారా లాంటి 130 రకాల వంటకాలు తిండికి పెట్టడంతో ఆశ్చర్య పడడం మల్లికార్జున్ వంతయింది.
* అల్లుడికి సర్ప్రైజ్
అల్లుడికి ఈ తరహాలో సర్ప్రైజ్ ( surprise)ఇవ్వాలని ప్లాన్ చేయడం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పసందైన వంటకాలు ఇవ్వడం సరే కానీ.. వాటిని తయారు చేసేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసు కదా. ఒకటి రెండు పిండి వంటకాలు తయారు చేయాలంటే రోజంతా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటిది ఏకంగా 130 రకాల వంటకాలు తయారు చేయడం సామాన్యం కాదు. ఈ విషయంలో మల్లికార్జున్ అత్తమామలను అభినందించాల్సిందే. నెటిజన్లు కూడా అత్తమామలకు అభినందనలు తెలుపుతున్నారు.
* గోదావరి జిల్లాల సాంప్రదాయం
సాధారణంగా గోదావరి జిల్లాల్లో( Godavari district) ఈ తరహా మర్యాదలు అధికం. అందుకే సంక్రాంతి పూట గోదావరి వెళ్లాలంటారు. ఒకవైపు కోడి పందాలు, ఇంకోవైపు గోదావరి అందాలు, మరోవైపు అత్తవారింటి మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే ఎక్కువమంది సంక్రాంతి పూట గోదావరి జిల్లాలకు వెళుతుంటారు. అయితే ఇప్పుడు ఆ సంస్కృతి తెలంగాణలో కనిపిస్తుండడం విశేషం. అత్తారింటి రాచ మర్యాదలు పుణ్యమా అని ఇప్పుడు మల్లికార్జున్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు.