Homeక్రీడలుIndia Vs West Indies 2nd Odi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ వన్డే లో...

India Vs West Indies 2nd Odi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ వన్డే లో ఇండియన్ టీం వైఫల్యం వెనుక కారణాలు ఇవేనా?

India Vs West Indies 2nd Odi: విండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాకు ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో పక్కా ప్రణాళికతో తాము వేసాము అనుకున్న ప్లాన్ కాస్త రివర్స్ అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇండియన్ టీం ఉన్నారు.బార్బడోస్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో విండీస్ టీం ఆరు వికెట్ల తేడాతో భారత్ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. మొత్తం మూడు మ్యాచ్లలో జరగాల్సిన ఈ సిరీస్ విండీస్ విజయంతో 1-1తో సమం అయింది. ఇక మంగళవారం జరగబోయే మూడవ మ్యాచ్లో గెలుపు భారత్ క్రికెట్ టీం పర్ఫామెన్స్ పై ఆధారపడి ఉంటుంది.

ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఓటమి టాస్ వేసే దగ్గర నుంచే మొదలయ్యింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా భారత్ చెట్టు బ్యాటింగ్ కి దిగింది.అయితే ఈ మ్యాచ్ లో ప్రధాన ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కు ఇండియన్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ రెస్ట్ ఇచ్చారు. అతి కీలకమైన రాబోయే మూడవ వన్డే మ్యాచ్ కి ముందు ప్రిపరేషన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ద్రవిడ్ పేర్కొన్నారు. అయితే ఈ ఒక్క నిర్ణయం నిన్న జరిగిన మ్యాచ్లో మొత్తం ఇండియన్ క్రికెట్ టీం పై భారీగా భారమైంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇషాన్ కిషన్ ,శుభ్‌మన్ గిల్ మెరుపు ఓపెనింగ్ అందించి తొలి వికెట్ కు 90 పరుగుల పార్ట్నర్షిప్ సాధించగలిగారు.

సజావుగా సాగుతుంది అనుకున్న మ్యాచ్లో ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్ (34) ఔట్ అయిన తరువాతే అసలు సిసలైన హై డ్రామా చోటు చేసుకుంది. ఇద్దరు బ్యాట్స్మెన్ సాధించిన స్కోర్ తీసి పక్కన పెడితే మిగిలిన జట్టు మొత్తం కలిసి 10 వికెట్లు కోల్పోయి సాధించింది 91 పరుగులు.అక్షర్‌ పటేల్‌ (1), సంజు శాంసన్‌ (9), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (7) పేలవమైన పర్ఫామెన్స్ తో సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యారు. భారత్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసే సమయానికి వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. కాస్త టైం తర్వాత వర్షం అయితే ఆగింది కానీ భారత్ జట్లు వికెట్లు పడిపోవడం మాత్రం ఆగకుండా కొనసాగింది.

పోనీ బ్యాటింగ్ సరే ఏదో అయిపోయింది బౌలింగ్ అన్న సక్రమంగా చేశారా అంటే అది కరువైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ టీం 36.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి సునాయాసంగా స్కోరు సాధించింది. విండీస్ ఆటగాడు షై హోప్ 80 బంతులలో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లు బాదడమే కాకుండా 63 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు.కార్టీ (48*), కైల్ మేయర్స్‌ (36) పరుగులు చేసి టీంకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో టీం ఇండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసి కాస్త పరువు నిలబెట్టగా కులదీప్ యాదవ్ ఒక్క వికెట్తో సరిపెట్టుకున్నాడు. ఇది నిజంగా ఇండియన్ క్రికెట్ టీంకు పెద్ద షాక్ అని చెప్పాలి.. ఆరు సంవత్సరాల తరువాత మొదటిసారి విండీస్ గడ్డపై భారత్ ఓటమి చవి చూసింది.
మరి ఈ పరంపర కొనసాగుతుందా లేక…. జట్టు విజయంతో తిరిగి వస్తుందా అనేది రేపటి మ్యాచ్ లో తెలుస్తుంది.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version