https://oktelugu.com/

Ex Minister Narayana- Priya: మాజీ మంత్రి నారాయణ పై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియ

కృష్ణప్రియ మరో వీడియోను తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తన మానసిక స్థితి అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 31, 2023 / 06:33 PM IST

    Ex Minister Narayana- Priya

    Follow us on

    Ex Minister Narayana- Priya: మాజీ మంత్రి నారాయణ ఇంట రచ్చ ఆగడం లేదు. తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ నారాయణ పై ఆయన సోదరుడి భార్య కృష్ణప్రియ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆమె భర్త సుబ్రహ్మణ్యం స్పందించారు. మానసిక స్థితి బాగులేని నేపథ్యంలో తన భార్య అలా మాట్లాడిందని చెప్పుకొచ్చారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు.అదే సమయంలో కృష్ణప్రియ హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నారాయణతో పాటు భర్త సుబ్రహ్మణ్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈ నేపథ్యంలో కృష్ణప్రియ మరో వీడియోను తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తన మానసిక స్థితి అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు. తానిచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ ల నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడుతున్నది పూర్తి వాస్తవమని.. ఎటువంటి పరీక్షలకు అయినా ఎదుర్కోడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

    నారాయణ నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. తాను ఒక్కదానినే బాధితురాలిని కాదని.. నారాయణ విద్యాసంస్థల తో పాటు మెడికల్ కాలేజీల్లో చాలామంది మహిళలు నారాయణకు బాధితులేనని చెప్పుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. తన వెనుక ఎటువంటి రాజకీయ శక్తులు లేవని.. కేవలం ఒక బాధితురాలిగా మాత్రమే తాను సోషల్ మీడియా వేదికగా ముందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. తనకు న్యాయం చేస్తారని సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. అయితే ఇంత జరుగుతున్నా నారాయణ స్పందించకపోవడం విశేషం.