https://oktelugu.com/

Chahal and Dhanashree : చాహల్ ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా? మరి ఆస్తి ఎలా పంచుకుంటారు?

ఆస్తిలో వాటా కావాలా వద్దా అనేది ధనశ్రీపై ఆధారపడి ఉంటుంది. ఆమె కోరుకుంటే, ఆస్తి పట్ల కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విషయంలో మాత్రం డబ్బుల సమస్య రాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2025 / 07:47 PM IST

    Chahal Dhanashri divorce

    Follow us on

    Chahal and Dhanashree : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ గురించి ఆశ్చర్యకరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. వీరిద్దరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అని ఓ నివేదిక తెలుపుతుంది. ధనశ్రీ, చాహల్ మధ్య చాలా కాలంగా సంబంధాలు సరిగా లేవనే సమాచారం. అయితే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను చాహల్ తొలగించడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. అయితే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటే ఆ ఆస్తి ఎలా పంచుకుంటారు? ఇంతకీ ఇది నిజంగా జరుగుతుందా లేదా దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అనే వివరాలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

    ఇటీవల ధనశ్రీ- చాహల్ గురించి సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు వైరల్ గా మారుతున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ఇక చాహల్ క్రికెట్ ద్వారా చాలా డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే. ఇంకా కూడా సంపాదిస్తున్నాడు. దీనితో పాటు, వారు ప్రకటనల నుంచి కూడా చాలానే సంపాదిస్తారు. ధనశ్రీ ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఆమె చాలా టీవీ షోలలో కనిపించింది. ధనశ్రీకి కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య విడాకుల వార్తలు రావడంతో వీరి ఆస్తి విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

    ధనశ్రీ-చాహల్ విడాకులు తీసుకుంటే ఆస్తి కూడా పంచుకుంటారా అనే అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. వాస్తవానికి, విడాకుల కేసులలో ప్రతిదీ కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చాహల్ – ధనశ్రీ ఇద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఒకవేళ విడాకులు తీసుకున్నా.. ఆస్తిలో వాటా కావాలా వద్దా అనేది ధనశ్రీపై ఆధారపడి ఉంటుంది. ఆమె కోరుకుంటే, ఆస్తి పట్ల కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విషయంలో మాత్రం డబ్బుల సమస్య రాలేదు.

    ధనశ్రీ-చాహల్‌ల సంబంధం ఎందుకు చర్చలోకి వచ్చిందనే ప్రశ్న కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే యుజ్వేంద్ర చాహల్ ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ నుంచి ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను తొలగించాడు. వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. కానీ ధనశ్రీ మాత్రం తన ప్రొఫైల్ నుంచి ఫొటోలను తొలగించలేదు. ఈ కారణంగానే విడాకుల వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

    ఇక యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉంటున్నాడు. చాహల్ ఆగస్టు 2023లో చివరి గేమ్ ఆడాడు. కానీ వ్యక్తిగత జీవితంతో మాత్రం చాలా సార్లు వార్తల్లో నిలుస్తుంటాడు. చాహల్, అతని భార్య ధనశ్రీ మధ్య ఏదో కుదరదని విషయం నడుస్తుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను కూడా చాహల్ తొలగించినా సరే ధనశ్రీ మాత్రం ఆయన ఫోటోలను తీసివేయలేదు. కానీ అన్ ఫాలో చేసింది.
    అయితే ఈ విడాకుల పుకార్లు నిజమేనని తెలుస్తుంది. విడాకులు తీసుకోవడం కూడా ఖాయం అంటున్నారు సంబంధిత వర్గాలు.

    2022 సంవత్సరంలో కూడా వారి సంబంధంలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక ధనశ్రీ వర్మ ఇంటిపేరు ‘చాహల్’ని తొలగించారు. కానీ ఆ తర్వాత ఇద్దరు మళ్లీ కలిసిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. తాము బాగున్నామని వారే పోస్ట్ కూడా పెట్టారు. ఇదెలా ఉంటే చాలా కాలం డేటింగ్ తర్వాత, యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. అయితే చాహల్ 2024 T20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు, కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున చాహల్ ఆడనున్నాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18 కోట్లకు ఒప్పందం చేసుకుందట.