https://oktelugu.com/

Devara: ‘దేవర’ ఖాతాలో మరో అరుదైన రికార్డు..100 రోజులు ఎన్ని కేంద్రాలలో పూర్తి చేసుకుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆడిన తాండవం ఎలాంటిదో మనమంతా చూసాము. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమాకి వచ్చిన షేర్ వసూళ్లను చూసి బయ్యర్స్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే గతం లో ఏ ఎన్టీఆర్ సినిమాకి కూడా ఈ రేంజ్ థియేట్రికల్ రన్ రాలేదు. ఆది, సింహాద్రి కూడా 'దేవర' తర్వాతనే అని చెప్పొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 07:08 PM IST

    Devara Movie Collection

    Follow us on

    Devara: గత ఏడాదిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ‘దేవర’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ వాళ్లకి వేరే లెవెల్ జోష్ ని అందించాడు. బెనిఫిట్ షోస్ నుండి ఈ చిత్రానికి కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. ఆరేళ్ళ తర్వాత విడుదలైన మా ఎన్టీఆర్ అన్న సినిమాకి ఇలాంటి టాక్ వచ్చిందేంటి అని అభిమానులు బాధపడ్డారు. కానీ బెనిఫిట్ షోస్ కి వచ్చిన టాక్ నూన్ షోస్ కి లేదు. సాయంత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆడిన తాండవం ఎలాంటిదో మనమంతా చూసాము. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమాకి వచ్చిన షేర్ వసూళ్లను చూసి బయ్యర్స్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే గతం లో ఏ ఎన్టీఆర్ సినిమాకి కూడా ఈ రేంజ్ థియేట్రికల్ రన్ రాలేదు. ఆది, సింహాద్రి కూడా ‘దేవర’ తర్వాతనే అని చెప్పొచ్చు.

    అయితే ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈమధ్య కాలం లో జనాలు ఓటీటీ కి బాగా అలవాటు పడడం వల్ల థియేట్రికల్ రన్ సినిమాలకు బాగా తగ్గిపోయింది. ఫలితంగా వంద రోజులు ఆడాల్సిన సినిమాలు కేవలం రెండు మూడు వారాలకే థియేటర్స్ నుండి తీసి వేయాల్సిన పరిస్థితి. అలాంటి రోజులు ఉన్న ఈ కాలంలో ఈ చిత్రం వంద రోజులను పూర్తి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆరు డైరెక్ట్ కేంద్రాలలో ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో మల్కి పురం (పద్మజ కాంప్లెక్స్), మండపేట (రాజారత్న కాంప్లెక్స్), గుంటూరు జిల్లా చిలకలూరిపేట (రామకృష్ణ థియేటర్), చిత్తూరు జిల్లాలోని కొత్త కోట (ద్వారకా పిక్చర్స్), కల్లూరు (MNR థియేటర్), రొంపిచెర్ల (MM డీలక్స్) వంటి సెంటర్స్ లో ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.

    అదే విధంగా ఓటీటీ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత మూడు నెలలుగా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. గత ఏడాది ఇంటర్నేషనల్ లెవెల్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 5 చిత్రాలలో ఒకటిగా దేవర నిలవడం గమనార్హం. రీసెంట్ గా వరుస హాలీవుడ్ చిత్రాలు విడుదల అవ్వడం వల్ల ఈ సినిమా టాప్ 10 ట్రెండింగ్ నుండి తొలగింది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తో కలిసి ఆయన ‘వార్ 2 ‘ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగష్టు నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాకి షిఫ్ట్ అవ్వనున్నాడు.