
Anushka Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థాంతరంగా టీ20 కెప్టెన్సీ పదవి నుంచి వైదొలగున్నట్టు ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇప్పటికే కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవడం లేదని.. అతడిని తప్పించాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతున్నా వేళ కోహ్లీనే తనకు తానుగా తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు కొందరైతే వ్యతిరేకించే వారు మరికొందరు.
మరి కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతడి భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎలా స్పందించారు? అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఈ క్రమంలో కోహ్లీ నిర్ణయంపై అనుష్కశర్మ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.
కోహ్లీ లేఖను పంచుకున్న అనుష్కశర్మ ఒకే ఒక హార్ట్ సింబల్ ఎమోజీని జతచేయడం విశేషంగా మారింది. అంటే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను ప్రేమతో అంగీకరిస్తున్నట్టుగా ఆమె సమాధానం ఉందని అర్థమవుతోంది.

ఇక మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ తనకు పనిభారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇదివరకూ వెల్లడించాడు. ఇప్పుడు కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన భార్య అనుష్క ఇలా స్పందించడం విశేషం.