https://oktelugu.com/

Anil Kumble: రోహిత్.. ఎలా ఆడుతున్నావో అర్థమవుతోందా? ఇలాగైతే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎలా నెగ్గుతుంది?: మాజీ ఆటగాడి చురకలు..

స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో భారత్ ఓటమిపాలైంది. చరిత్రలో తొలిసారిగా 0-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. 2000 సంవత్సరం తర్వాత వైట్ వాష్ కు గురైంది. దీంతో టీమిండియా పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 5, 2024 / 02:22 PM IST

    Anil Kumble

    Follow us on

    Anil Kumble: న్యూజిలాండ్ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణమైన ఆట తీర్ ప్రదర్శించాడు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ ఆ స్థాయిలో ఆడలేక పోతున్నాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మినహా.. గొప్పగా చెప్పుకునే ఇన్నింగ్స్ రోహిత్ ఇంతవరకు ఆడలేదు. ముంబై వేదికగా జరిగిన మూడవ టెస్టులో అత్యంత దారుణంగా విఫలమయ్యాడు.. రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి మునుపటిలాగా లేకపోవడంతో.. న్యూజిలాండ్ బౌలర్లు అతడిని పదేపదే టార్గెట్ చేశారు. అయితే రోహిత్ తనదైన శైలిలో ఆట తీరు ప్రదర్శించకపోగా.. న్యూజిలాండ్ బౌలర్ల చేతుల్లో చిక్కాడు. అది అంతిమంగా టీమిండియా విజయంపై ప్రభావం చూపించింది. అయితే రోహిత్ విఫలమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే స్పందించాడు. రోహిత్ వైఫల్యం పై అతడు మండిపడుతూనే.. అలా ఎందుకు ఆడుతున్నాడో.. దాని వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయో అనేది బయటపెట్టాడు . జాతీయ మీడియాతో ఆయన ఈ విషయాలను పంచుకున్నాడు. దీంతో అవి సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉన్నాయి.

    ఒకే రీతిలో..

    రోహిత్ మునుపటిలాగా టెక్నిక్ అవలంబించడం లేదని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. ” రోహిత్ తనదైన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. టెక్నిక్ అమలు చేయలేకపోతున్నాడు. పేస్ బౌలర్ల చేతిలో ఒకే తీరుగా అవుట్ అవుతున్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు.. అయితే ఈ విషయాన్ని సౌతి పసిగట్టాడు. అదేవిధంగా బంతులు వేయడంతో రోహిత్ ఔట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ కూడా అదే తీరుగా బంతులు వేశాడు. వాటికి రోహిత్ ఔట్ అయ్యాడు. రోహిత్ కు వారు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ లో షార్ట్ బంతులు వేస్తున్నారు. అయితే ఆ బంతులు ఆడే సమయంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. బంతి స్వింగ్ కాకపోయినప్పటికీ.. బౌలర్లు డెక్ తో హీట్ చేయడంతో రోహిత్ వారి ట్రాప్ లో పడుతున్నాడు. బంతి స్వింగ్ అవుతుందని భావించి.. వికెట్ సమర్పించుకుంటున్నాడు. రోహిత్ ఇలాగే ఆడితే కష్టం. సమస్యను అతడు అధిగమించాలి. ఆస్ట్రేలియా మైదానంపై ఇలాంటి ట్రిక్స్ ను అక్కడి బౌలర్లు ఎక్కువగా ప్రయోగిస్తారు. అలాంటప్పుడు రోహిత్ జాగ్రత్తగా ఉండాలి. వారి అస్త్రాలను ధైర్యంగా కాచుకోవాలి. లేకుంటే వికెట్ పోగొట్టుకోవడం సర్వసాధారణంగా మారుతుంది. న్యూజిలాండ్ పై ఓడిపోవడం పట్ల ఇప్పటికే జట్టు ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ది ఆట తీరు కనుక రోహిత్ కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుందని” అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.