https://oktelugu.com/

Singham Again: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ‘సింగం అగైన్’..వర్కింగ్ డేస్ లోనూ అదే జోరు..4 రోజుల్లో ఎంత వచ్చిందంటే!

'సింగం అగైన్', 'భూల్ భూలయా 3' వంటి చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి బాలీవుడ్ కి పూర్వవైభవం దక్కేలా చేసాయి. ఇది ఇలా ఉండగా 'సింగం అగైన్' చిత్రం పై అటు మాస్ ఆడియన్స్ లో, ఇటు యూత్ ఆడియన్స్ లో విడుదలకు ముందు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 02:17 PM IST

    Singham Again

    Follow us on

    Singham Again: గత కొంత కాలం నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ మన సౌత్ ఇండియన్ సినిమాలే ఆదుకుంటున్నాయి. కేవలం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ వంటి సినిమాలు తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. అలాంటి సమయంలో ‘సలార్’, ‘కల్కి’, ‘హనుమాన్’ వంటి చిత్రాలు బాలీవుడ్ ని కాపాడాయి. అయితే రీసెంట్ గా విడుదలైన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘స్త్రీ 2’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడంతో, బాలీవుడ్ పరువు కాస్త నిలబడింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘సింగం అగైన్’, ‘భూల్ భూలయా 3’ వంటి చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి బాలీవుడ్ కి పూర్వవైభవం దక్కేలా చేసాయి. ఇది ఇలా ఉండగా ‘సింగం అగైన్’ చిత్రం పై అటు మాస్ ఆడియన్స్ లో, ఇటు యూత్ ఆడియన్స్ లో విడుదలకు ముందు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవరం లేదు.

    ఎందుకంటే ఈ సినిమాలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, దీపికా పడుకొనే, కరీనా కపూర్, అర్జున్ కపూర్ ఇలా ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోలు ఉండడం, రోహిత్ శెట్టి లాంటి క్రేజీ మాస్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకుడు అవ్వడం, ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం. బాలీవుడ్ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి నాలుగు రోజులకు కలిపి 139 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట.

    సాధారణంగా దీపావళి వీకెండ్ తర్వాత ఏ సినిమాకి అయినా వసూళ్లు బాగా డ్రాప్ అవుతాయి. కానీ ‘సింగం అగైన్’ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు డ్రాప్ అవ్వలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆదివారం రోజు 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, సోమవారం రోజు 17 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. వర్కింగ్ డే లో 17 కోట్లు వచ్చాయంటే పబ్లిక్ లో ఈ చిత్రానికి మంచి మౌత్ టాక్ ఉన్నట్టు అర్థమని బాలీవుడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయట. నాలుగు రోజులకు కలిపి 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 192 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 170 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.