https://oktelugu.com/

Director Krish: మొదటి భార్యకు విడాకులు..11 ఏళ్ళ కొడుకు ఉన్న తల్లితో డైరెక్టర్ క్రిష్ వివాహం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సున్నితమైన అంశాల మీద సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. 'గమ్యం' సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం లో 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్' ,'కంచె', 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 02:30 PM IST

    Director Krish(1)

    Follow us on

    Director Krish: ప్రముఖ దర్శకుడు క్రిష్ రెండవ పెళ్ళికి సిద్దమయ్యాడు. 11 ఏళ్ళ వయస్సు ఉన్న కుర్రాడి తల్లితో గత కొంతకాలం నుండి క్రిష్ ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ఒక ప్రముఖ డాక్టర్ అట. ఆమెకు కూడా పెళ్లి జరిగి విడాకులు అయ్యిందని సమాచారం. వచ్చే వారంలో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరగనుందని తెలుస్తుంది. ఇంతకు ఆమె పేరు ఏమిటి?, తెలుగు ప్రజలకు ముఖ పరిచయం ఉన్న వ్యక్తి యేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా కొన్నేళ్ల క్రితం క్రిష్ రమ్య డాక్టర్ ని ప్రేమించి పెళ్లాడాడు. వీళ్లిద్దరి పెళ్లి అట్టహాసంగా టాలీవుడ్ సినీ ప్రముఖుల సమక్ష్యంలో జరిగింది. ఇప్పటికీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. కొన్నాళ్ల పాటు సంతోషంగా కలిసి జీవించిన ఈ దంపతులు కొన్ని విబేధాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

    ఆ తర్వాత కొంతకాలం కెరీర్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన క్రిష్ కి మరో డాక్టర్ పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరగడం,ఆ స్నేహం కాస్త నేడు పెళ్లి పీటల వరకు తీసుకొని రావడం వంటివి జరిగాయి. క్రిష్ ఇలా వరుసగా డాక్టర్లను పెళ్లి చేసుకోవడం ఏమిటి..?,ఎవరైనా తాము పని చేసే వాతావరణం లో ఉండే మనుషులను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళతో ఏళ్ళ తరబడి పని చేస్తుంటారు కాబట్టి. సినీ ఇండస్ట్రీ లో మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా ఇది సర్వసాధారణం . అలాంటిది ఒకసారి డాక్టర్ ని పెళ్లి చేసుకోవడం అంటే యాదృచ్ఛికం అనుకోవచ్చు, రెండవసారి కూడా డాక్టర్ నే పెళ్లి చేసుకోవడం వెనుక మతలబు ఏమిటి? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సున్నితమైన అంశాల మీద సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. ‘గమ్యం’ సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం లో ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ,’కంచె’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రానికి మధ్యలో కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా, షూటింగ్స్ వాయిదా పడుతూ రావడంతో తన సమయం మొత్తం వృధా అవుతుందని క్రిష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.