Bangladesh vs Sri Lanka : వన్డే వరల్డ్ కప్ ఆఖరి దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీస్ కు టీమిండియా, సౌతాఫ్రికా వెళ్లగా.. మిగతా రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ఈరోజు కీలకమైన శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారి ఒక బ్యాట్స్ మెన్ ఒక్క బంతి ఎదుర్కోకుండానే ఔట్ అవ్వడం తొలిసారి. దీనికి గార్డ్ తీసుకోకపోవడమే ప్రధాన కారణం.
ఏదైనా బ్యాట్స్ మెన్ క్రీజులోకి వచ్చి 3 నిమిషాలలోపే బ్యాటింగ్ గార్డ్ తీసుకోవాలి. ఏదైనా కారణం చేత లేట్ చేస్తే అతడిని ‘టైమ్డ్ అవుట్’గా ప్రకటిస్తారు. అయితే ఈరోజు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ ఇన్ టైంలోనే క్రీజులోకి వచ్చాడు. అయితే గార్డ్ తీసుకునే ముందుగా హెల్మెట్ కు బిగించే తాడు తెగడంతో ఆపేసి కొత్త హెల్మెట్ తేవాలని సూచించారు. ఈ క్రమంలోనే 3 నిమిషాల టైం ముగిసిపోయింది. దీంతో అంపైర్ ‘ఏంజెలో మాథ్యూస్’ను టైమ్డ్ అవుట్ గా ప్రకటించాడు.
అయితే రూల్స్ ప్రకారం అవుట్ అని.. కానీ బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఒప్పుకుంటే మీరు బ్యాటింగ్ చేయవచ్చని అంపైర్ సూచించాడు. దీంతో మాథ్యూస్ వెళ్లి మరీ షకీబ్ ను ప్రాధేయపడ్డాడు. ‘హెల్మెట్ పాడైపోయిందని.. తెప్పించుకున్నాని.. ’ అవుట్ ఇవ్వవద్దంటూ కోరాడు. కానీ క్రీడాస్ఫూర్తిని పట్టించుకోకుండా బంగ్లాదేశ్ కెప్టెన్ చేసిన ఈ పని వైరల్ అయ్యింది.
షకీబుల్ హాసన్ వ్యవహరించిన తీరుపై క్రీడా నిపుణులు, ఇతరులు నిప్పులు చెరిగారు. ఎంపైర్ రిక్వెస్ చేసినా.. మాథ్యూస్ ప్రాధేయపడ్డా కూడా కరగకుండా షకీబ్ వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. దీంతో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’గా ప్రకటించారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
THIS is FIRST TIME in INTERNATIONAL CRICKET.
Bangladesh appealed against Angelo Mathews for timeout and he was given out. #SLvsBAN #BANvsSL #CWC23 pic.twitter.com/Dw7KBCdQN0
— Bhanu (@singh_bhan33431) November 6, 2023