Anand Mahendra : ఇప్పుడంటే స్పిల్ బర్గ్, రాజమౌళి, ప్రశాంత్ వర్మ వంటి వారు ఊహాతీత సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి వారు అలాంటి సినిమాలు తీయగలుగుతున్నారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో విఠలాచార్య లాంటి దర్శకులు అద్భుతమైన సినిమాలను రూపొందించారు. ఇవాల్టికి ఆ సినిమాల చూస్తుంటే గ్రాఫిక్స్ అనిపించదు. ఆదివారం పూట విఠలాచార్య సినిమా లాంటి ఒక అద్భుతాన్ని ప్రముఖ కార్పొరేట్ కంపెనీ మహేంద్ర అండ్ మహేంద్ర అధినేత ఆనంద్ మహీంద్రా నెటిజన్ల కు వీడియో రూపంలో పరిచయం చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో తెగ ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
రోజురోజుకు మనుషులు పెరుగుతున్నారు. మనుషులు పెరిగినట్టు భూమి పెరగలేదు. ఉన్న భూమిలోనే సర్దుకోవాలి. జనాలు పెరుగుతున్నారు కాబట్టి అడవులు తగ్గుతున్నాయి. అడవులపై ఒత్తిడి పెరుగుతోంది. పైగా నగరాలు, పట్టణాలలో ఇరుకు ఇళ్లల్లోనే ప్రజలు ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహకులు వినూత్న పరిష్కారం చూపుతున్నారు. అందులో వెస్ట్రన్ కంట్రీస్ లో ట్రక్ లగ్జరీ ఇళ్ళు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, యూరప్ దేశాలలో వీటి వాడకం ఇటీవల పెరిగింది. సరిగ్గా అలాంటి వీడియోనే ఆనంద్ మహీంద్రా తనను అనుసరిస్తున్న నెటిజన్లకు ట్విట్టర్ ఎక్స్ వీడియో ద్వారా పరిచయం చేశారు.
ఆనంద్ మహేంద్ర చూపించిన ఆ వీడియోలో ఒక పెద్ద లగ్జరీ బస్సు ఉంది. అది చూస్తుంటే ఎలక్ట్రిక్ విధానంలో నడిచేలాగా ఉంది.. ఓ యువతి ఆ బస్సులోకి ఎక్కింది. బస్సును స్టార్ట్ చేసింది. అలాగే లోపలికి వెళ్లి సౌకర్యవంతమైన సోఫాలో పడుకుంది. ఆపై ఒక బటన్ నొక్కగానే ఎల్ఈడి టీవీ ప్రత్యక్షమైంది. కొంత దూరం వెళ్ళగానే రిలాక్స్ అవ్వడానికి అధునాతనమైన బెడ్ ఉంది. దాని పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మాడ్యులర్ కిచెన్ కొంత దూరంలో ఉంది. పడుకోవడానికి లగ్జరీ బెడ్ రూమ్ ఉంది. వెహికల్ ఛార్జ్ అవ్వడానికి దానిపైన సోలార్ ఫలకలు ఉన్నాయి.. ఈ వీడియో చూస్తుంటే విఠలాచార్య సినిమా కళ్ళ ముందు కనిపిస్తోంది.. ఎందుకంటే ఊహకు అతీతమైనవి కూడా నిజం లాగానే అందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పైకి చూస్తే ట్రక్కు లాగా ఉంది. లోపలేమో లగ్జరీ ఇల్లు ఉంది.. ఇలాంటి వాటిని ఆనంద్ మహీంద్రా ఆచరణలో పెడతారా” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.. ” ఇలాంటి లగ్జరీ ఇల్లు నిర్మించాలంటే ఎన్నో కోట్ల ఖర్చవుతుంది. కానీ దీనిని ట్రక్కులోనే పొందుపరిచారు. ఇది గొప్ప విషయమని” మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
Maybe this could be the outcome of a collaboration between Mahindra Trucks @MahindraTrukBus and Mahindra Lifespaces @life_spaces ! #SundayDreamspic.twitter.com/BY98Dyk7Xc
— anand mahindra (@anandmahindra) March 17, 2024