https://oktelugu.com/

IND vs ENG 5th T20: అమితాబ్ బచ్చన్ పై ఆగ్రహం ఉన్న ఇంగ్లాండ్.. అసలేం జరిగింది.. టీం ఇండియాకు సంబంధం ఏంటి ?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదవ టి20 మ్యాచ్‌ జరిగింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టును ఇంగ్లాండ్‌పై 135 పరుగుల భారీ విజయం సాధించి, 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 4-1తో ఘన విజయం సాధించింది.

Written By: , Updated On : February 3, 2025 / 07:10 PM IST
IND vs ENG 5th T20

IND vs ENG 5th T20

Follow us on

IND vs ENG 5th T20: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదవ టి20 మ్యాచ్‌ జరిగింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టును ఇంగ్లాండ్‌పై 135 పరుగుల భారీ విజయం సాధించి, 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 4-1తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కు ముఖేష్ అంబానీతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

అమితాబ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్
ఈ మ్యాచ్ అనంతరం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అది పెద్దగా వైరల్ అయ్యింది. ఆయన పోస్ట్‌లో ఇలా రాశారు: “ధో డాలా, నహీ, నహీ పఛాడ్ డియా, ధోబీ తలావోలో సీఖా డియా గోరె కో, కే క్రికెట్ కైసే ఖేలా జాతా హై, 150 రనో సే మారా”అంటూ రాసుకొచ్చారు. ఇది ఇంగ్లాండ్ జట్టును ఎగతాళి చేసినట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో వ్యతిరేకతను దక్కించుకుంది. అభిమానులు తాము వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఈ పోస్ట్‌పై చర్చలు పెట్టారు.

భారత జట్టు 4-1తో సిరీస్ గెలుపు
భారత జట్టు ఐదో టి20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 150 పరుగుల భారీ తేడాతో ఓడించింది. భారత్ ఈ సిరీస్‌ను 4-1తో దక్కించుకుంది. ఈ విజయంలో భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 13 సిక్స్‌లు బాదాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అభిషేక్ శర్మ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు పొందాడు. అలాగే, “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డు వరుణ్ చక్రవర్తికి దక్కింది.

భోజనం చేసిన అమితాబ్, అభిషేక్ బచ్చన్లు
భారత జట్టుకు విజయంతో పాటు, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా మ్యాచ్ అనంతరం ముంబై మాటుంగా ప్రాంతంలో ఉన్న “కేఫ్ మద్రాస్”లో దక్షిణ భారత వంటకాలు రుచిచూశారు ఈ సమయంలో కేఫ్ మద్రాస్ బయట అభిమానుల భారీ జనసందోహం కనిపించింది. ఈ విధంగా, భారత్ ఇంగ్లాండ్ పై 4-1తో విజయం సాధించడంతో, భారత క్రికెట్ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.