DC Vs MI 2024: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ముంబై, ఢిల్లీ జట్లు ఆదివారం వాంఖడే మైదానంలో తలపడ్డాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ లలో విఫలమైన ముంబై ఓపెనర్లు ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్(42) తొలి వికెట్ కు 80 భాగస్వామ్యం నెలకొల్పారు . 49 పరుగుల వద్ద రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 42 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లోనే కాట్ అండ్ బౌల్డ్ గా అవుటయ్యాడు. ఎన్నో ఆశలతో, సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా వెను దిరిగాడు.. నోర్ట్జీ బౌలింగ్లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. దీంతో ముంబై ప్రేక్షకులు ఒక్కసారిగా డీలా పడ్డారు.
అక్షర్ అదరగొట్టాడు
ఇక ఈ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది అక్షర్ పటేల్ ఇషాన్ కిషన్ ను అవుట్ చేసిన విధానం.. 11 ఓవర్ వేసేందుకు అక్షర్ పటేల్ సమాయత్తమయ్యాడు.. మొదటి బంతిని కిషన్ సిక్స్ గా మలిచాడు. రెండవ బంతిని కూడా అదే స్థాయిలో ఆడబోయాడు. బంతిని తప్పుగా అంచనా వేసిన కిషన్.. స్ట్రెయిట్ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ కు స్ట్రోక్ లో కాకుండా వేరే చోట తగిలి తక్కువ ఎత్తులో దూసుకు రావడంతో అక్షర్ పటేల్ ఆ బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. దీంతో కిషన్ నిరాశగా వెనుతిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్షర్ పటేల్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన విధానాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. గత మ్యాచ్ లో పేలవంగా బౌలింగ్ వేసిన అక్షర్ పటేల్.. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై జట్టుకు సంబంధించిన ఇద్దరు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు అద్భుతమైన బంతివేసి రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. కిషన్ ను కాట్ అండ్ బౌల్డ్ గా పెవిలియన్ పంపించాడు. మరో బౌలర్ నోర్ట్జీ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.
ముంబై ధాటిగా బ్యాటింగ్ చేసింది
వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన నేపథ్యంలో ముంబై జట్టు ఈ మ్యాచ్లో ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ 0 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. మిగతా బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తిలక్ వర్మ విఫలమైనప్పటికీ.. హార్దిక్ పాండ్యా 39, టిమ్ డేవిడ్ 45, రుమారియో స్టెఫర్డ్ 39 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, నోర్ట్జీ రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
10.1:
10.2: ☝️Axar Patel wins the battle Ishan Kishan with a brilliant caught and bowled
Watch the match LIVE on @JioCinema and @starsportsindia #TATAIPL | #MIvDC pic.twitter.com/bPUYRfPf86
— IndianPremierLeague (@IPL) April 7, 2024