https://oktelugu.com/

Virat – Akai : అకాయ్.. అకాయ్.. ఊగి పోతున్న సోషల్ మీడియా.. చివరికి సచిన్ సైతం..

కాగా, అకాయ్ పేరు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మారుమోగుతుండడం పట్ల విరాట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇది కింగ్ కోహ్లీ స్టామినా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 21, 2024 / 10:10 PM IST
    Follow us on

    Virat – Akai : సరిగ్గా నిన్న ఇదే సమయానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ “తనకు ఫిబ్రవరి 15న కుమారుడు పుట్టాడని… అతడి పేరు అకాయ్ అని పెట్టామని.. నా కుమారుడికి మీ అందరూ ఆశీస్సులు కావాలని.. ఈ సందర్భంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని” సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియా అకాయ్ నామస్మరణ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆ బుజ్జి చిన్నారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్ ఎక్స్ లో విరాట్ కోహ్లీ తనకు కుమారుడు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని చేసిన ట్వీట్ ను 9.5 మిలియన్ల మంది వీక్షించారు. 38.4 లక్షల మంది ఇష్టపడ్డారు.42,900 మంది రీ ట్వీట్ చేశారు.

    తన కొడుకు పేరు అకాయ్ అని చెప్పిన సమయం నుంచి విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన శుభాకాంక్షలు మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి. ” మీ అందమైన కుటుంబంలోకి అకాయ్ పెట్టాడు. అతడు అత్యంత విలువైన వ్యక్తి. మీకు నా హార్దిక శుభాకాంక్షలు అంటూ” సచిన్ చేసిన ట్వీట్ తెగ సర్క్యులేట్ అవుతోంది. ఇక చాలామంది సెలబ్రిటీలు విరాట్ కోహ్లీ తన కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పేరు వెనుక ఉన్న అర్ధాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.. ప్రకాశించే చంద్రుడిలాగా మరిన్ని వెలుగులు విరాట్ కోహ్లీ కుటుంబం పై అకాయ్ ప్రసరింపజేయాలని సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    సచిన్ మాత్రమే కాకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా వినూత్నంగా విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపింది. ” ఇండియా ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది. బెంగళూరు జట్టులోకి అకాయ్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది అత్యంత సంతోషకరమైన వార్త..అకాయ్ విరాట్ కుటుంబంలోకి వచ్చినందుకు వారికి మా శుభాకాంక్షలు. విరాట్ కుటుంబంలో ఇప్పుడు నలుగురు సభ్యులు” అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్విట్ చేసింది.. ఇక టీమిండియా ఒకప్పటి ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ వంటి వారు విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కాగా, అకాయ్ పేరు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మారుమోగుతుండడం పట్ల విరాట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇది కింగ్ కోహ్లీ స్టామినా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.