Ajay Jadeja : టీమిండియా ఒకప్పటి దిగ్గజ ఆటగాడు అజయ్ జడేజా గుర్తున్నాడా.. ఇప్పుడు అతను రాజ్యానికి వారసుడయ్యాడు!

టీమిండియాలో అజారుద్దీన్ శకం నడుస్తున్నప్పుడు.. అజయ్ జడేజా పేరు ప్రముఖంగా వినిపించేది. రాబిన్ సింగ్, అజయ్ జడేజా, మహమ్మద్ అజారుద్దీన్ త్రయం టీమ్ ఇండియాకు వెన్నెముకలా ఉండేవారు. అప్పట్లో ఆజారుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో.. అజయ్ జడేజా కెరియర్ కూడా కనుమరుగయిపోయింది.

Written By: NARESH, Updated On : October 13, 2024 9:17 am

Ajay Jadeja

Follow us on

దశాబ్దాల కాలం గడిచిన తర్వాత అజయ్ జడేజా ఇన్నేళ్లకు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. రాజ వంశానికి వారసుడయ్యాడు. అజయ్ జడేజాది గుజరాత్ లోని రాజ వంశీకుల కుటుంబం. తమ కుటుంబానికి తదుపరి వారసుడిగా జడేజా ను జాంనగర్ కు జామ్ సాహెబ్ శత్రు సల్య సింహ్ జీ దిగ్వి జై సింహ్ జీ జడేజా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.. తమ రాజు కుటుంబ వారసత్వ సింహాసనాన్ని అజయ్ జడేజా త్వరలో అధిష్టిస్తారని వెల్లడించారు. ” పాండవులు 14 సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం దసరా జరుపుకున్నారు. నేడు ఆరోజు కాబట్టి అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా.. నవ నగర్ ప్రాంతానికి తదుపరి జాం సాహెబ్ గా ప్రకటిస్తున్నాం. ఇది జాంనగర్ ప్రజలకు లభించిన గొప్ప వరంగా మేము భావిస్తున్నామని” శత్రు సల్య సింహ్ జీ వెల్లడించారు. జాంనగర్ ప్రాంతం ఒకప్పటి ప్రిన్స్ లీ స్టేట్ నవానగర్ గా పేరుపొందింది.. మనదేశంలో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ.. గుజరాత్ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో రాజరిక వ్యవస్థ కొనసాగుతోంది.

క్రికెట్ లోకి ఎంట్రీ

క్రికెట్ మీద ఉన్న అభిమానంతో అజయ్ జడేజా ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. అద్భుతమైన ఆట తీరుతో 1992 -2000 వరకు 15 టెస్ట్, 196 వన్డే మ్యాచ్ లు టీమ్ ఇండియా తరఫున ఆడాడు.. క్రికెట్లో నిర్వహించే రంజి, దులీప్ పేర్లను జడేజా కుటుంబ సభ్యులైన కె ఎస్ రంజిత్ సింహ్ జీ, కేఎస్ దులీప్ సింహ్ జీ పేర్లను పెట్టారు.. 1996లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుపై భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో అజయ్ జడేజా చివర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. జట్టుకు అవసరమైన పరుగులను సాధించాడు. కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు చేసి.. సంచలనం సృష్టించాడు..ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచింది. ఆ మ్యాచ్ లో వకార్ యూనిస్, జావెద్ వంటి బౌలర్లను అజయ్ ఎదుర్కొన్నాడు.. ధాటిగా పరుగులు చేశాడు. అప్పట్లోనే డాషింగ్ ఆటగాడిగా అజయ్ పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం.. సింగిల్ లభించే చోట డబల్ తీయడం వంటి ప్రయోగాలు చేసేవాడు. ఫీల్డింగ్లో అజయ్ జడేజా సంచలనాలు సృష్టించాడు. ఒక్క చేత్తో క్యాచ్ లు పట్టేవాడు. అమాంతం గాల్లోకి ఎగిరి స్టంపులను బంతులతో గిరాటేసేవాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను చూస్తుండగానే రనౌట్ చేసేవాడు.. ఇలాంటి అద్భుతాలు చేశాడు కాబట్టే టీమ్ ఇండియాలో.. అజయ్ జడేజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. పేరు చివర జడేజా ఉంది కాబట్టి.. ప్రస్తుత ఆటగాడు రవీంద్ర జడేజాకు.. అజయ్ జడేజా కు సంబంధం ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదు.