https://oktelugu.com/

Rajinikanth-KS Ravikumar : రజినీకాంత్ కి ఆ స్టార్ డైరెక్టర్ కు మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది…

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కొంతమందికి మాత్రమే ఇక్కడ సపరేట్ క్రేజ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా వాళ్ల వల్లే ఇండస్ట్రీలో చాలా వరకు రికార్డు బ్రేకింగ్ సినిమాలు వస్తుంటాయి. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లు భారీ సినిమాలను చేసి ఇండస్ట్రీ పరువు నిలబెడుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 13, 2024 / 09:30 AM IST

    Rajinikanth-KS Ravikumar

    Follow us on

    Rajinikanth-KS Ravikumar : రజనీకాంత్ లాంటి స్టార్ హీరో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా వాళ్ళు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. దాదాపు 40 సంవత్సరాలకు మించి ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ రేంజ్ ను అందుకున్న హీరో కూడా తనే కావడం విశేషం.. మరి అలాంటి నటుడు చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. మరి ఇదిలా ఉంటే రజనీకాంత్ సూపర్ స్టార్ రేంజ్ ను అందుకోవడంలో చాలామంది దర్శకులు ఆయనకు చాలావరకు అండగా నిలిచారు. ముఖ్యంగా కే ఎస్ రవికుమార్ అయితే రజనీకాంత్ తో చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలను తీసి అతనిని సూపర్ స్టార్ గా మార్చడంలో కీలకపాత్ర వహించాడు. రజినీకాంత్ కెరియర్ లో అత్యంత కీలకమైన సక్సులుగా చెప్పుకునే ముత్తు, నరసింహ లాంటి సినిమాలు ఆయన తీయడం విశేషం… ఇక వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ అయితే ఉంది. అలాగే వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉంది. మరి ఇలాంటి వారు ఈ మధ్య కొన్ని వివాదాలతో కొంతవరకు దూరం అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ వచ్చిన లింగా సినిమా భారీ సక్సెస్ అవుతుందని అందరు అనుకున్నారు.

    కానీ ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక ప్లాప్ అయితే వచ్చింది. మరి అప్పుడు అంతా కామ్ గా ఉన్నప్పటికి ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన సమయంలో ఇప్పుడు లింగా సినిమా ఫ్లాప్ మీద ఆ సినిమా దర్శకుడు స్పందించాడు. అయితే రజినీకాంత్ వల్లే ఈ సినిమా ప్లాప్ అయిందంటూ ఆయన పెను సంచలనాలను సృష్టించే కామెంట్లైతే చేశాడు.

    ముఖ్యంగా రజనీకాంత్ ఈ కథను మార్చమన్నాడని దానివల్ల ఆయన కథ ను మార్చినట్టుగా చెప్పాడు. ఇక అందువల్లే ఈ సినిమా ప్లాప్ అయిందంటు తను కామెంట్స్ చేశాడు. ఇక ఇన్ని రోజులు బాగానే ఉన్న వీళ్ళిద్దరి ఎక్కడ మనస్పర్థలు వచ్చాయి. కే ఎస్ రవికుమార్ ఎందుకు కామెంట్లు చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికైతే రజనీకాంత్ తో కేసు రవికుమార్ మరొక సినిమా చేయాల్సింది.

    కానీ ప్రస్తుతం రజనీకాంత్ ఉన్న బిజీ ఒకటైతే, కే ఎస్ రవి కుమార్ అసలు ఫామ్ లో లేడు. కాబట్టి అతనికి రజినీకాంత్ డేట్స్ ను ఇవ్వలేకపోయాడు. దాని వల్ల కోపంతో కే ఎస్ రవికుమార్ రజనీకాంత్ ఇమేజ్ ని బ్యాడ్ చేసే కామెంట్లు చేస్తున్నాడు అంటూ రజనీకాంత్ అభిమానులు కూడా చాలా వరకు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…