Thalavan Movie : ఓటిటి లో ట్రెండ్ సృష్టించిన మలయాళం మూవీ…ఇలాంటివి కదా మనకు కావాల్సింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక అందులో కొందరు స్టార్ హీరోలుగా మారితే మరికొందరు మాత్రం ఫేడౌట్ హీరోలుగా మిగిలిపోతున్నారు...

Written By: Gopi, Updated On : October 13, 2024 9:16 am

Thalanav Movie

Follow us on

Thalavan Movie :  ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ సినిమా ఇండస్ట్రీకి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలను చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా వాళ్ల సినిమాల హవా నే కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మన తెలుగు సినిమాల కంటే మలయాళీ వాళ్ళు డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేస్తారని ఒక టాకైతే సినిమా ఇండస్ట్రీలో బాగా నాటుకు పోయింది. ఇక దానికి తగ్గట్టుగానే మనవాళ్ళు చేసే సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నప్పటికి చిన్న సినిమాలను పెద్ద సక్సెస్ లుగా నిలపడం లో చాలా వరకు వెనకబడిపోతున్నారు. ఇక అదే తరహాలో ఇప్పుడు కూడా పలు రకాల సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వివిధ సినిమాలు వచ్చినప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేయడంలో మాత్రం మలయాళం ఇండస్ట్రీ పెట్టింది పేరనే చెప్పాలి… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ‘తలావన్ ‘ సినిమా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బిజు మీనన్, ఆసిఫ్ అలీ ప్రముఖ పాత్ర వహించిన ఈ సినిమాలు ఆధ్యాంతం ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ ని షేక్ చేస్తుందనే చెప్పాలి.

ఇక ఇదంతా చూస్తున్న తెలుగు సినిమా విమర్శకులు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగుతుంది. అయినప్పటికీ మన వాళ్ళు భారీ బడ్జెట్ సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక మన తెలుగులో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలను మాత్రం చేయడం లేదు.

మరి మొత్తానికైతే ఎవరు ఏమనుకున్నా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ సక్సెస్ ని సాధించాల్సిన సమయం అయితే ఆసన్నమైనది. కాబట్టి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తేనే చిన్న సినిమాలు సైతం పెద్ద సక్సెస్ లని సాధిస్తాయి అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త తరహా కథల కోసం మన అభిమానులైతే చాలావరకు ఎదురుచూస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాల్లో వైవిధ్యాన్ని చూపించినప్పటికీ చిన్న కథల్లో మాత్రం మన వాళ్లు పెద్దగా కొత్త తరహా కథలను చేయలేకపోవడం గమనార్హం…