Indian Cricketers: ప్రపంచం ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వెంట పరుగులు పెడుతున్నది. కొత్త కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్టుగా.. పరిస్థితులు మారిపోతున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే సరి కొత్తగా కనిపిస్తున్నాయి.
సరిగ్గా దశాబ్దం క్రితం స్మార్ట్ ఫోన్లు మార్కెట్ ను ముంచెత్తడం మొదలైంది. ఆ తర్వాత వాటి విస్పోటనం నిరాటంకంగా సాగుతోంది. ఆండ్రాయిడ్ అప్లికేషన్లలో కొత్త కొత్త వెర్షన్లు సందడి చేస్తున్నాయి. సరికొత్త అనుభూతిని యూజర్లకు కలిగిస్తున్నాయి. ఇక సాంకేతిక పరిజ్ఞానం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. సమూల మార్పులకు కారణమవుతోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు కాని.. ఇప్పటికైతే పెను ప్రకంపనలకు నాంది పలుకుతోంది.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మిగతా రంగాలకు కూడా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే మనిషి ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
Also Read: భయంకరమైన బ్యాటర్లు ఎంతమందున్నా.. మిస్టర్ ఐసీసీ కోహ్లీనే.. ఎందుకంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో రకాల మాయలు జరుగుతున్నాయి. మనిషిని పోరిన మనిషిని రూపొందించి.. వీడియోలు తయారు చేస్తున్నారు. సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. కొంతమంది క్రియేటర్లు ఒక అడుగు ముందుకు వేసి టీమ్ ఇండియా క్రికెటర్లను అమ్మాయిలుగా మార్చేశారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా.. ఇలా కీలకమైన ఆటగాళ్లను మొత్తం అందమైన యువతులుగా రూపొందించారు. నిజంగా వారేనేమో అనిపించేలా భ్రమ కల్గించారు. కానీ ఆ రూపంలో ఉన్న ఇండియన్ క్రికెటర్లు భలే ఆకట్టుకున్నారు. సచిన్ రూపంలో ఉన్న మహిళ అయితే అత్యంత అందంగా ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫిమేల్ క్రికెటర్లకు ఇండియన్ జెర్సీలు వేయడం విశేషం. అయితే ఈ వీడియో ఫై కొంతమంది సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు రూపొందించడం వల్ల క్రికెటర్ల అభిమానులకు ఆగ్రహం వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచికి ఉపయోగిస్తే బాగుంటుంది. ఇలాంటి వాటిని చేయడం వల్ల మున్ముందు తప్పుడు మార్గాలకు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచికి మాత్రమే ఉపయోగిస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇలాంటి పనులకు ఉపయోగిస్తే అది తప్పుడు సంకేతాలను కలిగిస్తుందని” సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇటీవల చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఇతర పోస్టులు పెరిగిపోయాయి. కొందరైతే చూసేందుకు వీలు లేని దృశ్యాలు కూడా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఆ తరహా వీడియోలతో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది.