Daggubati Purandeswari
Daggubati Purandeswari: దేశవ్యాప్తంగా బిజెపి( Bhartiya Janata Party) జెండా రెపరెపలాడుతోంది. కేంద్రంలో అధికారం చేపట్టడమే కాదు ముచ్చటగా మూడోసారి కూడా పవర్ లోకి వచ్చింది బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ. దేశంలో చాలా రాష్ట్రాల్లో పాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని హస్త గతం చేసుకుంటూ వచ్చింది. అయితే మరి కొన్నాళ్లపాటు ఈ దేశాన్ని పాలించాలన్నది బిజెపి ప్లాన్. అందుకోసం ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా అనేక రకాలుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి.. అమలు చేయాలని భావిస్తోంది. తద్వారా మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని గట్టి ప్లాన్ చేస్తోంది.
Also Read: బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్!
* ఈసారి మహిళలకు ఛాన్స్
భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) జాతీయ అధ్యక్ష స్థానానికి ఈసారి మహిళలకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల నుంచి మహిళా నేతల పేర్లను సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి బిజెపి చీఫ్ పురందేశ్వరి పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి గెలిచారు పురందేశ్వరి. ఆమెకు తప్పకుండా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఏపీ నుంచి కేవలం భూపతి రాజు శ్రీనివాస వర్మకు మాత్రమే చాన్స్ ఇచ్చారు. అయితే చివరి నిమిషం వరకు పురందేశ్వరి పేరు వినిపించింది కానీ.. పదవి మాత్రం దక్కలేదు. లోక్సభ స్పీకర్ గా ఆమె పేరును పరిగణలోకి తీసుకుంటారని ప్రచారం నడిచింది. కానీ మరోసారి ఓం బిర్లాకు చాన్స్ ఇచ్చారు.
* రాజకీయ అనుభవం
పురందేశ్వరికి ( pure deshwari )బిజెపి జాతీయ అధ్యక్షురాలిగా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆమెకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఎన్టీఆర్ వారసురాలిగా గుర్తింపు ఉంది. టిడిపి అధినేత చంద్రబాబుతో విభేదించిన పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పురందేశ్వరి సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి ఎంపీగా, మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు పురందేశ్వరి. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. దీంతో బీజేపీలో చేరారు పురందేశ్వరి. బిజెపి రాష్ట్ర చీఫ్ గా కొనసాగుతూ వచ్చిన ఆమె టిడిపితో పొత్తుకు మార్గం సుగమం చేశారు. ఏపీలో బిజెపి ప్రాతినిధ్యం పెరగడానికి కారణం అయ్యారు. అందుకే ఆమె విషయంలో బిజెపి హై కమాండ్ సైతం ప్రత్యేక ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబు కీలక భాగస్వామి. ఆయన సైతం పురందేశ్వరి విషయంలో పావులు కదుపుతారని తెలుస్తోంది. మొత్తానికైతే పురందేశ్వరికి బిజెపిలో కీలక పదవి తప్పదని తెలుస్తోంది.
Also Read: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి కీలక నేత రీ ఎంట్రీ!