FIFA Rankings: ఆట తీరు ఇంత పేలవమా? మరింత దిగజారిన టీమిండియా ర్యాంక్..

గత ఏడు సంవత్సరాల లో టీమిండియా ఫుట్ బాల్ క్రీడలో కొంత మెరుగైన ప్రతిభే చూపుతోంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ట్రోఫీలు సాధించకపోయినప్పటికీ దేశవాళీలో జరిగే మ్యాచ్ లలో జట్టు అడపాదడపా విజయాలు సాధించడంతో కొద్దో గొప్పో ర్యాంక్ మెరుగ్గా ఉండేది.

Written By: Suresh, Updated On : February 16, 2024 5:27 pm

FIFA Rankings

Follow us on

FIFA Rankings: ప్రపంచ జనాభాపరంగా చూసుకుంటే మన దేశం మొదటి స్థానంలో ఉంటుంది. క్రికెట్ మినహా మిగతా ఆటల విషయంలో మన దేశం అంత గొప్ప ర్యాంకులను కలిగి ఉండదు.. మనదేశంలో పుట్టిన హాకీ లోనూ మన జట్టు నెంబర్ వన్ స్థానంలో ఉండదు. కీలకమైన టోర్నీల్లోనూ సత్తా చాటదు. మనదేశంలో పుట్టిన కబడ్డీ విషయంలోనూ కొంత మెరుగే అయినప్పటికీ.. కానీ అది ఆశించినంత స్థాయిలో కాదు. అయితే మిగతా వాటిల్లో గొప్పగా ఆడుతున్నామా అంటే అదీ లేదు. తాజాగా ఫుట్ బాల్ క్రీడా సమాఖ్య వెలువరించిన ర్యాంకింగ్స్ లో భారత్ మరింత దిగజారిపోయింది. ఏకంగా 15 స్థానాలు చేజార్చుకుని 117 వ స్థానంలో నిలిచింది.

గత ఏడు సంవత్సరాల లో టీమిండియా ఫుట్ బాల్ క్రీడలో కొంత మెరుగైన ప్రతిభే చూపుతోంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ట్రోఫీలు సాధించకపోయినప్పటికీ దేశవాళీలో జరిగే మ్యాచ్ లలో జట్టు అడపాదడపా విజయాలు సాధించడంతో కొద్దో గొప్పో ర్యాంక్ మెరుగ్గా ఉండేది. అప్పట్లో భారత్ 102 వ ర్యాంకులో కొనసాగేది. కానీ రోజురోజుకు ఆటగాళ్ల ఆట తీరు దారుణంగా ఉండటం.. అది జట్టు విజయాల మీద ప్రభావం చూపించడంతో భారత జట్టు ర్యాంకు కాస్త 117కు పడిపోయింది. గత ఏడు సంవత్సరాల లో టీమిండియా ర్యాంకు 102లో కొనసాగేది.. కానీ ఇటీవల కాలంలో దారుణమైన ఓటములను మూటకట్టుకోవడంతో భారత ఫుట్ బాల్ జట్టు 117 వ స్థానానికి పడిపోయింది.

ఇక ఇటీవల కాలంలో జరిగిన ఏఎఫ్సీ ఏషియన్ కప్ లో భారత జట్టు మూడు మ్యాచ్లు ఆడి ఓడిపోయింది. గ్రూపు దశలోనే భారత జట్టు ఓడిపోవడం ఆటగాళ్లనే కాదు అభిమానులను సైతం నిరాశపరిచింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్థాన్, సిరియా జట్లతో జరిగిన మ్యాచ్లలో భారత జట్టు కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం విశేషం. దీంతో జట్టు ర్యాంకింగ్స్ గత ఏడు సంవత్సరాల లో లేని విధంగా 15 స్థానాలు కిందికి పడిపోవడం విశేషం.. ఇక ఆసియా పరిధిలో భారత జట్టు ప్రస్తుతం 22వ స్థానంలో కొనసాగుతోంది. బైచుంగ్ భుటియా కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత జట్టు ఎన్నో విజయాలు సాధించింది. అప్పట్లో ర్యాంక్ కూడా అటు ఇటుగా 100 లోపు ఉండేది. అప్పట్లో భారత జట్టు ఆట తీరు చూసి ఏదో ఒక రోజు ఫిఫా వరల్డ్ కప్ సాధిస్తుందని అభిమానులు అనుకునేవారు.. కానీ నాటి నుంచి నేటి వరకు ఆటతీరులో మరింత నైపుణ్యాన్ని సాధించాల్సిన ఆటగాళ్ళు.. తీసి కట్టు ఆట తీరుతో జట్టుపరువును గంగలో కలుపుతున్నారు. ఆట తీరు ఇలానే ఉంటే ఒకప్పుడు ఇండియన్ ఫుట్ బాల్ జట్టు ఉండేదని పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుందని అభిమానులు వాపోతున్నారు.