IPL 2024: అతడు ఆడితే మైదానం హోరెత్తిపోతుంది. రెచ్చిపోయి ఫోర్లు కొడితే శివాలెత్తుతుంది. దూకుడుగా సిక్సర్లు బాదితే శిగాలుగుతుంది. అలాంటి ఆటగాడు ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడడు. ఉత్తరాది ప్రాంతానికి చెందిన అతడు హిందీ అనర్ఘళంగా ప్రసంగించగలడు. అయితే కొద్ది రోజుల నుంచి ఆటగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కానీ అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి.. పెద్ద కథే ఉందట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, పార్థివ్ పటేల్.
కోల్ కతా జట్టు ఐపిఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉంది. ఆ జట్టులో రింకూ సింగ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.. ఆదివారం రాత్రి కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కు హిందీ వ్యాఖ్యాతలుగా సురేష్ రైనా, పార్దివ్ పటేల్ వ్యవహరించారు. ఇందులో భాగంగా రింకూ సింగ్ ను ఓ ఆట ఆడుకున్నారు.. ” రింకూ సింగ్ ఈ మధ్య బయట కూర్చుంటున్నాడు. ఎందుకు అని ఆరా తీస్తే.. ఒక విషయం అర్థమైంది. అతడి ఇంగ్లీష్ బాగా మెరుగైందని” పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. దానికి రింకూ సింగ్ నవ్వాడు. ” నా ఇంగ్లీస్(ఇంగ్లీష్) ఇంకా గాడిలో పడలేదని” ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ బదులిచ్చాడు.. వారిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే మధ్యలో సురేష్ రైనా ఎంట్రీ ఇచ్చాడు..” ఇతర ప్రాంతాల నుంచి నీకు వచ్చే సందేశాలను ఎలా నియంత్రించుకుంటున్నావు. బయటనుంచి నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారు” అని సురేష్ రైనా ప్రశ్నించాడు.. దీనికి రింకూ సింగ్ గట్టిగా నవ్వాడు..” నాకు బయట నుంచి వచ్చే మెసేజ్ ల పట్ల అంతగా అటెన్షన్ లేదు. వాటిని మామూలుగానే డీల్ చేస్తాను” అని రింకూ సింగ్ బదులిచ్చాడు.. దీనికి సురేష్ రైనా.. గట్టిగా నవ్వాడు.. బిగ్గరగా అరిచాడు. వారి ముగ్గురి మధ్య జరిగిన ఈ సంభాషణ నవ్వులు పూయించింది.
అయితే ఈ సీజన్లో కోల్ కతా తరఫున ఆడిన రింకూ సింగ్ .. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కోల్ కతా జట్టు ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో అతనికి ఆడే అవకాశం రాలేదు. ఒకవేళ అవకాశాలు వచ్చినప్పటికీ అతడు పెద్దగా వినియోగించుకోలేదు. 14 మ్యాచ్ లు ఆడిన అతడు, 168 రన్స్ మాత్రమే చేశాడు. మరో వైపు అతనికి టి20 ప్రపంచ కప్ లో చోటుదక్కలేదు. ఈ క్రమంలో స్టాండ్ బై ప్లేయర్ గా ఆడేందుకు అతడు అమెరికా బయలుదేరి వెళ్ళనున్నాడు.
Translate in English @TranslateMom
— Madhan (@MMK491) May 27, 2024