Kalki 2898 AD: కల్కి మూవీ నుంచి వచ్చిన కొత్త వీడియో…సినిమా మీద అంచనాలను పెంచేసింది గా…!

Kalki 2898 AD: ఇక ప్రభాస్ నాగశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుందనే చెప్పాలి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ వీడియోలో ప్రభాస్ వెల్డింగ్ చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు వచ్చి "భైరవ నువ్వు ఎప్పుడు వెల్డింగ్ చేస్తూనే ఉంటావు" అనే చిన్నపిల్లల మాటలతో వీడియో స్టార్ట్ అవుతుంది.

Written By: NARESH, Updated On : May 28, 2024 10:40 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్.. ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ వస్తున్నాయి.

ఇక ప్రభాస్(Prabhas) నాగశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుందనే చెప్పాలి. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వాళ్ళు రిలీజ్ చేసిన ఈ వీడియోలో ప్రభాస్ వెల్డింగ్ చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు వచ్చి “భైరవ నువ్వు ఎప్పుడు వెల్డింగ్ చేస్తూనే ఉంటావు” అనే చిన్నపిల్లల మాటలతో వీడియో స్టార్ట్ అవుతుంది.

Also Read : కల్కి సినిమా ముందు ఉన్న టార్గెట్స్ ఇవే…

ఇక దాంతో బి అండ్ బి (బుజ్జి & భైరవ) ఈనెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటారు అంటూ తెలియజేశారు… ఇక దీంతో ప్రభాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజానికి ప్రభాస్ నుంచి ఒక్క చిన్న గ్లింప్స్ వచ్చినా కూడా ప్రస్తుతం తన అభిమానులు చాలా ఆనంద పడుతూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా రెడీ అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే.మరి ముఖ్యంగా ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే ఇప్పటికే పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అందువల్లే ప్రభాస్ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకోవడంతో పాటుగా ఈ సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్ పెట్టి నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో…

 

Also Read :  ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 అప్డేట్ ఇదే.. పుకార్లను నమ్మొద్దు!