Kavya Maran: అంత బాధ, ఏడుపులో కూడా కావ్య మారన్‌ చేపిన పనికి ఆటగాళ్లు ఫిదా!

డ్రెస్సింగ్‌ రూంలో కావ్య మాటలకు క్రికెటర్లు ఫిదా అయ్యారు. ‘ఈ సీజన్‌లో అన్ని బ్యాటింగ్‌ రికార్డులను జట్లు ఆటగాళ్లు బద్దలు కొట్టారు. ఇందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 7:36 am

Kavya Maran

Follow us on

Kavya Maran: IPL 2024: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ – 17 ఫైన్‌లో KKRతో జరిగిన ఫైన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( (SRH) ఓడిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ క్రికెటర్ల ఆటతీరు అందరినీ బాధించింది. జట్టు యజమాని కవ్య మారన్‌ అయితే కన్నీరు పెట్టుకున్నారు. అయితే మ్యార్‌ తర్వాత ఆమె టీం డ్రెస్సింగ్‌ రూంకు వెళ్లి క్రికెటర్లతో మాట్లాడారు. వారిలో స్ఫూర్తి నింపేలా ప్రసంగించారు. కావ్య మాటలకు జట్టు సభ్యులు ఫిదా అయ్యారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతీ మ్యార్‌లో కావ్య హైలెట్‌..
ఈ ఐపీఎల్‌తో కావ్య ఇండయన్‌ క్రష్‌ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ఆమె హావబావాలు, నవ్వులు, బాధ, చిందులు ఇలా అన్నింటిపై మీడియా ఫోకస్‌ చేసింది. సోషల్‌ మీడియాలో కూడా కావ్య స్టేడియంలో చేసే సందడి వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత కావ్య కంటతడి పెట్టారు. అయితే కెమెరాకు కనపడకుండా కన్నీళ్లు తుడుచుకున్నారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్‌ అనంతరం కావ్య డ్రెస్సింగ్‌ రూంకు వెళ్లారు. క్రికెటర్లతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

కావ్య స్పీచ్‌కు క్రికెటర్ల ఫిదా..
డ్రెస్సింగ్‌ రూంలో కావ్య మాటలకు క్రికెటర్లు ఫిదా అయ్యారు. ‘ఈ సీజన్‌లో అన్ని బ్యాటింగ్‌ రికార్డులను జట్లు ఆటగాళ్లు బద్దలు కొట్టారు. ఇందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఐపీఎల్‌ 2023లో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన జట్టును ప్యాట్‌ కమిన్స్‌ ఫైనల్‌కు చేర్చాడు. ఇందుకు కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 ఆడే విధానాన్ని మీరు పునర్నిర్వచించారు. కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచినా ఇప్పుడు అందరూ మా గురించే మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆఫ్‌-డే జరగాలి, కానీ నిజంగా గొప్పది. బ్యాట్‌ మరియు బంతితో మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని క్యావ పేర్కొంది. బాధలోనూ కావ్య చెప్పిన మాటలు జట్టు ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చాయి. తను డ్రెస్సింగ్‌ రూం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆటగాళ్ల అందరి ముఖాల్లో చిరునవ్వు ఉండేలా చూసుకున్నారు.