Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ ఘనవిజయం సాధించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీమ్ సెమీస్ వెళ్ళే టీముల్లో ముందంజలో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ ఆఫ్గనిస్తాన్ బౌలర్ల దాటికి 241 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.అఫ్గాన్ బౌలర్ అయిన ఫారుఖీ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి తనదైన రీతిలో ఆఫ్ఘనిస్తాన్ టీం కి మరోసారి మంచి విజయాన్ని అందించాడు.ఇక అలాగే శ్రీలంకన్ బ్యాట్స్ మెన్స్ కి ముప్పు తిప్పలు పెట్టి మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు తిప్పేశాడు.
శ్రీలంక నిర్దేశించిన టార్గెట్ ని అఫ్గాన్ ప్లేయర్లు చాలా ఈజీగా చేదించారు.ఇక ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ టీమ్ మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది.ఇక అఫ్గాన్ టీమ్ వరుసగా ఇంగ్లాండ్,పాకిస్తాన్, శ్రీలంక టీమ్ లకి షాక్ ఇవ్వడం చూస్తుంటే తొందరలోనే ఈ టీమ్ ఒక బలమైన టీం గా ఏర్పడబోతుంది అనే సంకేతాలు అయితే మిగితా దేశాల క్రికెట్ టీమ్ లకి అందుతున్నాయి. ఇక అఫ్గాన్ టీమ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా ఈ మాత్రం పర్ఫామెన్స్ చేస్తుంది అంటే వాళ్ళకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవొచ్చు…
నిజానికి అఫ్గాన్ నిన్నటి మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతం గా రాణించి మరోసారి తమ సత్తా చాటుకుంది. వాళ్ల ధాటికి అఫ్గాన్ చేతిలో శ్రీలంక ఓడిపోక తప్పలేదు. అయితే ఈ విజయానికి ముఖ్య కారణం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లలో కనిపిస్తున్న కసి అనే చెప్పాలి. ఎలాగైనా మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలి ప్రపంచ దేశాల కంటే మనం ఏ మాత్రం తక్కువ కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనే కాన్ఫిడెంట్, కసి వాళ్ళలో కనిపిస్తుంది దానివల్లే వాళ్ళు ఈ స్థాయిలో రాణించగలుగుతున్నారు. ఇక శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 45 వ ఓవర్లోనే చేదించి వాళ్ళ టీం సత్తా ఏంటో చూపించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ లలో ఒక గుర్భాజ్ ని మినహా ఇస్తే మిగిలిన ప్లేయర్లు అందరూ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ షాహిది ,అజ్మతుల్లా ఇద్దరు హాఫ్ సెంచరీ లు చేసి చివరి వరకు ఉండి టీమ్ కి మంచి విజయాన్ని అందించారు. ముఖ్యంగా షాహిది అయితే ప్రతి మ్యాచ్ లో తనదైన ఎఫర్ట్ పెడుతూ టీం ని గెలిపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు.ఇక ఈ టోర్నీలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ , శ్రీలంక లాంటి పెద్ద జట్లు కూడా అప్పునిస్తాన్ టీమ్ ఆట తీరుకి వాళ్ళ ముందు ఓడిపోక తప్పలేదు.
ఇక ఇలాంటి క్రమంలో ఆఫ్గనిస్తాన్ అన్ని టీమ్లను వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్ లో ఫిఫ్త్ పొజిషన్ కి చేరుకుంది.ఇక మీదట కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తే ఆఫ్గనిస్తాన్ టీమ్ సెమీస్ కి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే అఫ్గాన్ ఒక చిన్న పసికూన దేశమై ఉండి వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ప్రతి టీంలో ఉన్న ప్లేయర్లందరూ కూడా అఫ్గాన్ టీమ్ లాగా మ్యాచ్ లని ఆడితే ఈజీగా ప్రతి మ్యాచ్ ని విజయతీరాలకు చేర్చవచ్చు అనేదానికి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లను ఉదాహరణకు తీసుకోవచ్చు… ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద దేశాలకు అఫ్గాన్ టీమ్ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక అఫ్గాన్ టీమ్ సెమీస్ కి వచ్చిన, రాకపోయిన ఈ టోర్నీలో వాళ్లు కూడా మంచి పోటీ ఇచ్చిన టీమ్ గా చెప్పుకోవచ్చు…