Afghanistan Vs Ireland: టెస్ట్ మ్యాచ్ ను గల్లీ క్రికెట్ చేశారు కదయ్యా

బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇబ్రహీం జర్దాన్ (53), షాహిది(20), ఖరీం జనత్(41) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.

Written By: Suresh, Updated On : February 29, 2024 2:49 pm
Follow us on

Afghanistan Vs Ireland: రోజంతా ఆడాలి. బౌలింగ్ లో విన్యాసాలు చేయాలి. బ్యాటింగ్ లో అద్భుతాలు చూపాలి. ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపించాలి. ఇవన్నీ ప్రదర్శించాలంటే ఆటగాళ్లు కచ్చితంగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. టెస్ట్ క్రికెట్ ఆడిన వారు ఎందులోనైనా రాణిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి తరం ఆటగాళ్లకు టెస్ట్ అంటే బోరు..అదే టి20 అయితే యమ జోరు. ఈ టి20 ల కాలంలో టెస్ట్ క్రికెట్ మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతో ఐసీసీ చిన్న, పెద్ద జట్లు అని తేడా లేకుండా టెస్ట్ సిరీస్ లు నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ జట్లు ఐదు టెస్టుల సిరీస్ ను ఆడుతున్నాయి. ఇప్పటికే నాలుగు టెస్టులు ముగియగా.. భారత్ 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది. మరోవైపు చిన్న జట్లను కూడా టెస్టు సిరీస్ ఆడించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తోంది. బుధవారం ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఆటగాళ్లకు నైపుణ్యం పెరగాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తే.. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు మాత్రం దాన్ని గల్లి క్రికెట్ చేశారు. కేవలం ఒక్కరోజు కూడా పూర్తిస్థాయిలో ఆడకుండా తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయ్యారు.

బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇబ్రహీం జర్దాన్ (53), షాహిది(20), ఖరీం జనత్(41) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. ఐర్లాండ్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ వేయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతొలి ఇన్నింగ్స్ లో 54.5 ఓవర్లలో 155 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ ఐదు వికెట్ల తీశాడు. యంగ్, క్యాంప్ హర్ చెరో రెండు, మెక్ కార్తీ ఒక వికెట్ తీశారు.

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు కూడా మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టునే అనుసరించింది. కర్టీస్ క్యాంప్ హర్(49), హర్రీ టక్టర్(32) చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. అయితే మిగతా బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ఐర్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆ తర్వాత పాల్ స్టిర్లింగ్(42), లోర్కాన్ టక్కెర్(21) క్రీజ్ లోకి వచ్చారు. అబేధ్యమైన ఆరో వికెట్ కు ఇప్పటివరకు 61 పరుగులు జోడించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీద్ జడ్రాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. జియా ఉర్ రెహమాన్ రెండు వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఐర్లాండ్ జట్టుపై 15 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా , టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక్కరోజులోనే ఆలౌట్ కావడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. టెస్ట్ క్రికెట్ ను గల్లి క్రికెట్ లాగా మార్చారని ఆటగాళ్లపై కామెంట్లు చేస్తున్నారు.