Rahmat Shah Injury: క్రికెట్ లో అప్పుడప్పుడు సంచలనాలు నమోదవుతుంటాయి. బౌలర్లు వికెట్లు తీయడం ద్వారా.. బ్యాటర్లు పరుగులు తీయడం ద్వారా.. ఫీల్డర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా అద్భుతాలను సృష్టిస్తుంటారు. తాజాగా ఆఫ్గనిస్తాన్ ఆటగాడు మైదానంలో అద్భుతం సృష్టించాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అదరగొట్టాడు. అయితే అతడు తీవ్రంగా గాయపడి వీల్ చైర్ మీద మైదానంలోకి రావడం విశేషం. అంతేకాదు ఎవరూ ఊహించని ఫలితాన్ని తన జట్టుకు అందించి సరికొత్త సంచలనం సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ నడుస్తోంది. వన్డేలలో ఆఫ్గనిస్తాన్ జట్టుతో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. పైగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు లో ఉన్న ఆటగాళ్ల కంటే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అనుభవం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ల దూకుడు ముందు.. తేలిపోయారు. తలవంచారు. అంతేకాదు ఓటమిని ఎదుర్కొని పరువు తీసుకున్నారు. చివరికి 3 వన్డేల సిరీస్ కూడా కోల్పోయారు.
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ నడుస్తోంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆఫ్గనిస్తాన్ గెలిచింది. రెండవ వన్డేలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అదే జోరు కొనసాగించింది. ఏకంగా 81 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. రెండవ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహమత్ షా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. మ్యాచ్ 15 ఓవర్లో పరుగులు తీస్తుండగా అతడు ఒకసారిగా కిందపడ్డాడు. కండరాల నొప్పితో అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కనీసం కాళ్లు కూడా కదపలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని వీల్ చైర్ లో బయటకు తీసుకెళ్లారు. గాయమైనప్పటికీ మళ్లీ కొద్దిసేపటి తరువాత అతను బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే ఈసారి గాయం అతనికి తీవ్రమైంది. ఈ మ్యాచ్లో రహమత్ 12 బంతుల్లో 9 పరుగులు చేశాడు. ఆఫ్గనిస్తాన్ తరఫున ఇబ్రహీం జర్దాన్ 95 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వన్డే సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకోగా.. మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను బంగ్లాదేశ్ 3-0 తేడాతో సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. 44.5 ఓవర్లలో 190 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 109 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తద్వారా 81 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ దక్కించుకుంది.