Team India New Jersey: వరల్డ్ కప్ దగ్గరపడుతున్నకొద్దీ ప్రతి టీం కూడా చాలా ఉత్సాహం గా వరల్డ్ కప్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతుంది. ఇక అందులో భాగంగానే మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య భారీ ఎత్తున జరుగనుంది.అందుకే ఈ మ్యాచ్ కూడా ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టు కునే అవకాశం అయితే ఉంది.ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రపంచ కప్ కి ప్రపంచం లో ఉన్న దేశాలు వివిధ మార్పులతో చాలా ఫ్రెష్ గా బరి లోకి దిగుతున్నాయి. ఇక ఇండియా టీం కూడా అందుకు మినహాయింపు కాదు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగె ఈ వరల్డ్ కప్ లో ఇండియా టైటిల్ ఫెవరెట్ గా రంగం లోకి దిగుతుంది ఇక ఇలాంటి టైం లో ఇండియా టీం కొత్త జర్సీ తో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడనున్నట్టుగా తెలుస్తుంది.
ఇక జర్సీ స్పాన్సర్ అయినా అడిడాస్ రీసెంట్ గా టీం ఇండియా జర్సీ ని విడుదల చేసింది.సింగర్ రాఫ్తార్ పాడిన తీన్ కా డ్రీం ( మూడో దానికోసం కల ) అనే పాటను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.ఇక భారత కెప్టెన్ అయినా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అయినా హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఆ జర్సీ లో కనిపిస్తూ ఫోటోలు కూడా దిగారు…కొత్త జర్సీ లో భుజాలపై ఉన్న మూడు గీతాలు మన త్రివర్ణ పథకం లోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) రంగులను చూపిస్తూ ఉన్నాయి.
ఇక టీం లోగో పైన నిజానికి అయితే మూడు నక్షత్రాలు ఉండాలి, కానీ ఇక్కడ రెండు నక్షేత్రాలు మాత్రమే ఉన్నాయి అంటే అవి ఇంతకు ముందు ఇండియా సాధించిన రెండు (1983 , 2011 ) వరల్డ్ కప్ లకి చిహ్నాలు గా వాటిని ముద్రించడం జరిగింది.ఇప్పటికే కొత్త జర్సీ లో మన ప్లేయర్లను చూస్తూన్నా అభిమానులు సంతోషం లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా తో మూడు వన్డేలు ఆడిన తరువాత డైరెక్ట్ గా వరల్డ్ కప్ లో అడుగుపెడుతుంది. మన ఇండియా వరల్డ్ కప్ లో ఆడే మొదటి మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా తోనే కావడం నిజంగా విశేషం అనే చెప్పాలి….ఇక ఈసారి కూడా ఇండియా వరల్డ్ కప్ గెలిచి మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచినా టీం గా చరిత్రలో నిలవాలని కోరుకుందాం…