Rohit Sharma: న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన మూడు టెస్టులను కోల్పోయిన తర్వాత భారత్ టెస్ట్ ర్యాంకింగ్ లో రెండవ స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఆస్ట్రేలియా మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100, బుమ్రా 8 వికెట్లు పడగొట్టడంతో మొత్తంగా భారత్ ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది. న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఓడిపోయి.. తీవ్ర ఒత్తిడి మధ్య ఉన్న టీమ్ ఇండియాకు పెర్త్ విజయం సాంత్వన ఇచ్చింది.
రోహిత్ కీలక నిర్ణయం
తన భార్య రెండోసారి ప్రస వించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. తనదైన వ్యూహాలతో భారత జట్టును గెలిపించాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండవ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ఇటీవల అతడు ఆస్ట్రేలియా వెళ్ళాడు. ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. అయితే తొలి టెస్ట్ లో యశస్వి జైస్వాల్, గిల్ అద్భుతంగా ఆడారు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 161 రన్స్ చేశాడు. రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ – జైస్వాల్ 200 పరుగుల పై చిలుకు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ జోడి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన స్థానాన్ని త్యాగం చేసినట్టు తెలుస్తోంది.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.. తొలి టెస్ట్ మాదిరే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ భారత జట్టుకు ఓపెనర్లు గా వ్యవహరిస్తారు. వన్ డౌన్ లో గిల్ చాటింగ్ చేస్తాడు. అతని తర్వాత విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో రోహిత్ శర్మ, ఆరవ స్థానంలో రిషబ్ పంత్, ఏడవ స్థానంలో ధృవ్ జురెల్, ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్, తొమ్మిదో స్థానంలో హర్షిత్ రానా, పదో స్థానంలో బుమ్రా బ్యాటింగ్ చేయనున్నారు. తొలి టెస్ట్ కు గిల్ దూరం కాగా.. రెండో టెస్టుకు అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు. అడిలైడ్ టెస్ట్ కు అందుబాటులోకి వచ్చాడు. అయితే తొలి టెస్ట్ లో విఫలమైన ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్ కు రెండో టెస్ట్ లో రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..పెర్త్ టెస్ట్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో.. అడిలైడ్ టెస్ట్ లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.