Adelaide Pink Ball Test
Adelaide Pink Ball Test : అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. డే అండ్ నైట్ విధానంలో ఈ టెస్ట్ కొనసాగుతోంది. గులాబీ బంతితో ఈ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మైదానంపై తేమ ఉండడంతో ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ అదరగొట్టాడు. ఏకంగా ఆరు వికెట్లు సొంతం చేసుకొని భారత జట్టు టాప్ ఆర్డర్ ను వణికించాడు. టీమిండియాలో నితీష్ కుమార్ రెడ్డి చేసిన 42 పరుగులే టాప్ స్కోర్ అంటే.. భారత బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. భారత బ్యాటర్లలో నలుగురు సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. హోలాండ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు.
లైట్లు వెలగలేదు
అడిలైడ్ వేదికగా నిర్వహిస్తున్న డే అండ్ నైట్ టెస్టులో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లైట్లు సరిగ్గా వెలగకపోవడంతో మైదానంలో చీకటి అలుముకుంది. రెండుసార్లు లైట్లు వాటి కవే నిలిచిపోయాయి. దీంతో మైదానంలో ఆడుతున్న టీమ్ ఇండియా ప్లేయర్లు అసహనానికి గురయ్యారు. ఫ్లడ్ లైట్లు నిలిచిపోవడంతో మైదానంలో అంధకారం నెలకొంది. దీంతో అభిమానులు తమ ఫోన్లలో టార్చ్ లైట్లు ఆన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇలా రెండుసార్లు ఫ్లడ్ లైట్లు నిలిచిపోవడంతో భారత ఆటగాళ్లలో అసహనం పెరిగిపోయింది. మైదానంలో జరుగుతున్న మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.” గొప్పగా ప్రచారం చేశారు. డే అండ్ నైట్ టెస్ట్ అని చెప్పారు. ఇక్కడ మాత్రం చీకటి ఉంది. లైట్లు వెలుగుతున్నాయి. వాటికవే ఆగిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో మ్యాచ్ చూడటం అంటే సాహసం అనే చెప్పాలి. ఈ సాహసాన్ని మాకు అందించిన క్రికెట్ ఆస్ట్రేలియా కృతజ్ఞతలు అంటూ” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. కడపటి వార్తలు అందే సమయానికి ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (13) స్వల్ప స్కోర్ కే బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ స్వీనే (38*), లబూ షేన్ (20*) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత స్కోర్ తో పోల్చితే ఆస్ట్రేలియా ఇంకా 94 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చాటిన ఈ మైదానంలో భారత బౌలర్లు తేలిపోవడం ఆ జట్టు అభిమానులను కలతకు గురిచేస్తోంది.
అడి లైడ్ వేదిక జరుగుతున్న పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో పదేపదే ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దీంతో భారత ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఫ్లడ్ లైట్లు ఇలా రెండుసార్లు ఆగిపోయాయి. దీంతో అభిమానులు తమ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేశారు. #AUSvsIND #PinkBallTest pic.twitter.com/m1oXpdNrWW
— Anabothula Bhaskar (@AnabothulaB) December 6, 2024