Site icon OkTelugu

Akira Nandan: అడవి శేష్ చేతుల్లో అకిరా నందన్ మొదటి చిత్రం..? అసలు ఏమి జరుగుతోంది!

Akira Nandan

Akira Nandan

Akira Nandan: గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అకిరా నందన్(Akira Nandan) మొదటి చిత్రం గురించి ప్రచారం అవుతున్న కొన్ని వార్తలు అభిమానుల్లో కొత్త కన్ఫ్యూజన్ కి తెరలేపేలా చేస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఒక బడా నిర్మాత, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ని రీసెంట్ గానే కలిసి, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కోసం కథ ఉందా అని అడిగారట. ఆ నిర్మాత ఎవరు ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ, అకిరా నందన్ మొదటి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది. ఈరోజు ఈ అకిరా మొదటి సినిమా గురించి సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్(Adavi Sesh) అకిరా నందన్ మొదటి సినిమాకు కథ అందించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించబోతున్నాడని ప్రచారం సాగుతోంది.

అకిరా నందన్ కి అడవి శేష్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యం మామూలుది కాదు. సమయం దొరికినప్పుడల్లా అకిరా అడవి శేష్ తోనే ఉంటుంటాడు. వీళ్ళ మధ్య ఈ రేంజ్ బాండింగ్ ఎలా ఏర్పడిందో తెలియదు కానీ, ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం ఉంది. అయితే పవర్ స్టార్ కొడుకు మొదటి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రానికి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు అసాధారమైనది గా ఉంటుంది. అలాంటి సినిమాని అడవి శేష్ మోయగలడా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. ఇది వరకు అడవి శేష్ దర్శకుడిగా పని చేసాడు, అదే విధంగా స్క్రీన్ ప్లే రైటర్, కథా రచయితగా కూడా వ్యవహరించాడు. ఆయన హీరో గా నటించిన ప్రతీ సినిమాకు అడవి శేష్ స్క్రిప్ట్ ని అందించాడు. వాటిల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి.

ఒక టెక్నీషియన్ గా అడవి శేష్ ని అసలు వంక పట్టలేం. కానీ ఒక స్టార్ హీరో కొడుకుని మ్యానేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఏ మాత్రం తేడా జరిగినా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా అడవి శేష్ పై ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తారు. పైగా అడవి శేష్ ఇప్పటి వరకు అన్నీ స్పై జానర్ సినిమాలే చేసాడు, అకిరా మొదటి సినిమాకు స్పై జానర్ అంటే అసలు వర్కౌట్ అయ్యే పని కాదు. మరి అడవి శేష్ అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా కొత్త జానర్ లో సినిమా తీస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ సినిమా అయితే కేవలం రూమర్ మాత్రమే.

Exit mobile version