spot_img
Homeక్రీడలుక్రికెట్‌India Vs Pakistan T20 World Cup 2026: భారత్ తో మ్యాచ్ .. పాక్...

India Vs Pakistan T20 World Cup 2026: భారత్ తో మ్యాచ్ .. పాక్ తీసుకున్న నిర్ణయం.. అన్ని వందల కోట్లు..

India Vs Pakistan T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో తాము ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు ఆమోదం తెలపడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు హర్షం వ్యక్తం చేశాయి.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల భారత అభిమానులు.. ఇతర ప్రేక్షకుల కంటే బ్రాడ్కాస్టర్లు ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఐసీసీ కూడా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడం వల్ల ఐసీసీ, గ్లోబల్ బ్రాడ్కాస్టర్లకు దాదాపు 1500 కోట్ల వరకు ఆదాయం మిగిలినట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ గనుక రద్దయి ఉంటే మీడియా పార్ట్నర్ అయిన జియో హాట్ స్టార్ కు ఐసీసీ భారీగా పరిహారం చెల్లించాల్సి వచ్చేది. అంతేకాదు 16 సెకండ్ల ప్రకటనకు దాదాపు 25 నుంచి 40 లక్షల మధ్య సుమారు 300 కోట్ల వరకు యాడ్ రెవెన్యూ పోయేది.

స్పాన్సర్ షిప్ లు.. డిజిటల్ ట్రాఫిక్.. హోటల్ బుకింగ్ రూపంలో కూడా ఆర్థికంగా నష్టం వచ్చేది. ఇప్పటికే భారత అభిమానులు చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ రూములు కూడా బుక్ చేసుకున్నారు. ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టుతో ఆడబోమని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. దీంతో చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద వ్యక్తం చేశారు.

భారత్, పాకిస్తాన్ అంటే హై వోల్టేజ్ సమరం జరుగుతూ ఉంటుంది. ఇటీవల ఆసియా కప్ లో కూడా అదే స్థాయిలో రెండు దేశాల మధ్య పోటీ సాగింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో అయితే పాకిస్తాన్ బౌలర్లు వర్సెస్ ఇండియన్ బ్యాటర్లు అన్నట్టుగా సమరం సాగింది. ఈ సమరంలో ఇండియన్ బ్యాటర్లు సత్తా చూపించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. ఫలితంగా టీమిండియా విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూసుకుంటే టీమిండియా పాకిస్తాన్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. అలాంటప్పుడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ గట్టి పోటీ ఇవ్వడం మినహా చేసేది ఏమీ ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper
Exit mobile version