ACC U19 Asia Cup 2025: ఇప్పటివరకు భారత అండర్ 19 జట్టు యువ ప్లేయర్లలో వైభవ్ సూర్య వంశీ గురించి మీడియాలో ప్రధానంగా కథనాలు వచ్చేవి. ఎందుకంటే అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసేవాడు. విధ్వంసానికి పరాకాష్టగా ఆడేవాడు. ప్రత్యర్థి బౌలర్లపై కనికరం లేకుండా బ్యాటింగ్ చేసేవాడు. బంతితో దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టు.. ప్రత్యర్థి ప్లేయర్లతో గెట్టు పంచాయతీలు ఉన్నట్టు బ్యాటింగ్ చేసేవాడు. అతని పరాక్రమానికి చివరికి ఐపీఎల్ కూడా చిన్న పోయింది.. ఈ ఏడాది సీజన్లో వైభవ్ దుమ్మురేపాడు. సెంచరీ తో కదం తొక్కాడు.
ఐపీఎల్ మాత్రమే కాదు, ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో కూడా వైభవ్ ఇటీవల యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. వాస్తవానికి అండర్ 19 జట్టులో వైభవ్ సూర్యవంశీ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ వర్గాలలో కూడా అతడికే విపరీతమైన క్రేజ్ ఉంది. అంటే ఇప్పుడు వైభవ సూర్యవంశీని సైతం డామినేట్ చేసే ఒక ఆటగాడు పుట్టుకొచ్చాడు. పుట్టుక రావడమే కాదు ఏకంగా అండర్ 19 ఆసియా కప్ లో డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అతని గురించి జాతీయ మీడియాలో, అటు స్పోర్ట్స్ సర్కిల్స్‌లో విపరీతంగా ప్రచార సాగుతోంది.
అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా మలేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా సాగిపోయారు.. ముఖ్యంగా అభిజ్ఞ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ సమయంలో 48 ఓవర్లో అభిజ్ఞ, చౌహన్ ఏకంగా 29 పరుగులు సాధించారు. ఆ ఓవర్ లో వరుసగా 4, wide, 6,6, wide, 1,4 పరుగులు సాధించారు. అభిజ్జాన్ దూకుడుతో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. వైభవ్ సూర్య వంశీ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. వేదాంత త్రివేది 90 పరుగులు చేశాడు.