Travis Head : అభిషేక్ శర్మ బయటికి తీసిన ఆ నోట్ లో This one is for Orange army అని ఇంగ్లీషులో రాసి ఉంది.. అభిషేక్ శర్మ ఆ నోట్ బయటికి తీసిన తర్వాత ఉప్పల్ మైదానంలో కేరింతలకు అడ్డే లేకుండా పోయింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ అభిషేక్ శర్మ నోట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే విషయాన్ని వ్యాఖ్యాతలు ప్రస్తావించగా రెడ్డి అసలు విషయం బయటపెట్టాడు. ” అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడని నేను ప్రతి సందర్భంలో అనుకున్నాను. దాన్ని ఆరో మ్యాచ్లో అతడు నిజం చేసి చూపించాడు. మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ తన జేబులో ఉన్న నోట్ తీసి బయటికి చూపించాడు. సాధారణంగా కూల్ గా ఉండే అభిషేక్ శర్మ ఆస్థాయిలో ఇన్నింగ్స్ ఆడటం గొప్ప విషయం. కాకపోతే ఆ నోట్ ఎప్పుడు బయటికి వస్తుందా అని చూసేవాడిని. మొత్తానికి ఐదు మ్యాచ్ల తర్వాత ఆరో మ్యాచ్ కు అది బయటికి వచ్చింది. మొత్తంగా చూస్తే అభిషేక్ శర్మ తనకు ఇష్టమైన ఇన్నింగ్స్ ఆడినట్టు కనిపించిందని” హెడ్ వ్యాఖ్యానించాడు.
Also Read : సెంచరీ కొట్టినా టీమిండియా అంటేనే జంకుతున్న హెడ్.. అతడి ఆనందం ఆవిరి కావడానికి కారణం అదేనా?
అప్పటినుంచట.. కసి పెంచుకున్నాడట..
అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు బలమైన విజయాన్ని అందించాలని ఈ సీజన్ ప్రారంభంలోనే నిర్ణయించుకున్నాడట. మైదానంలో తీవ్రంగా కసరత్తు చేశాడట. అయితే గడిచిన ఐదు మ్యాచ్లలో అభిషేక్ శర్మ రాజస్థాన్ రాయల్స్ జట్టు జరిగిన మ్యాచ్ మినహా వరుసగా విఫలమయ్యాడు. అందువల్లే హైదరాబాద్ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంది. అయితే జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్న తరుణంలో అభిషేక్ శర్మ ఒక్కసారిగా సింహం లాగా జూలు విధిల్చాడు. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్న లాగా మారాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మొత్తానికి హైదరాబాద్ జట్టుకు మర్చిపోలేని గెలుపును అందించాడు . అందువల్లే అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు ఒక్కసారిగా హీరో అయిపోయాడు.” అభిషేక్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అతడు కొంతకాలంగా మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మొత్తంగా అనుకున్న ఫలితాన్ని సాధించాడు. అతని ఆట చూసినప్పుడు బ్యాట్ చేతికి మొలిచిందేమో అనిపించింది.. ఈ తీరుగా గనక ఆడితే హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. మరిన్ని మ్యాచ్లు కూడా ఇలానే విజయం సాధించి హైదరాబాద్ విజేతగా నిలవాలని కోరుకుంటున్నామని” సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ” అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఒక ఎత్తు అయితే.. అతడు జేబులో నుంచి బయటికి తీసిన నోటు మరొక ఎత్తు. అతడు తన స్వాగ్ ప్రదర్శించాడని” హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ట్రావిస్ హెడ్.. బంతి మీద ఇంత కసి ఏంట్రా బాబూ..మరీ ఇలా కొడుతుంటే బౌలర్లు ఏం కావాలి..